నల్గొండ జిల్లా త్రిపురారంలో ఓ టీవీ షో రూమ్‌ను జబర్దస్త్ ఫేమ్ అవినాష్ ప్రారంభించారు. తన మిత్రుడు అజయ్ ఈ వ్యాపారం మొదలుపెట్టడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. అజయ్‌తో కలిసి హైదరాబాద్‌లో ఇంజినీరింగ్ చదువుకున్నామని తెలిపారు.
తన మిత్రుడి టీవీ షో రూమ్‌ను ప్రారంభించి ఒక టీవీని కొనుగోలు చేసినట్లు అవినాష్ తెలిపారు. జబర్దస్త్ వంటి కామెడీ కార్యక్రమాలు చూడడానికి టీవీలు అవసరమని ఆయన చమత్కరించారు. జబర్దస్త్ కామెడీ షో ద్వారానే తనకు మంచి గుర్తింపు వచ్చిందన్నారు. అవినాష్‌ను చూడడం కోసం స్థానికులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
ఇదీ చదవండి: యువతకు శుభవార్త: ఆర్మీలో చేరికకు సింగరేణి ఉచిత శిక్షణ