ETV Bharat / state

father and son relationship family issues : కుమారుడితో వివాదం.. చివరకు తల్లిదండ్రులదే విజయం

father and son relationship family issues : నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో హౌసింగ్ బోర్డు కాలనీలో తండ్రీ కొడుకుల మధ్య వివాదం నెలకొంది. ఈ నేపథ్యంలో తన కుమారుడు పట్టించుకోవడం లేదని... తాను సొంతగా కొన్న ఇంట్లోకి రానివ్వడం లేదంటూ ఆ తండ్రి కలెక్టర్ అప్పిలేట్ ట్రిబ్యునల్​కు వెళ్లారు. కలెక్టర్ ఆదేశాల మేరకు కొడుకు, కోడలిని ఇంటి నుంచి అధికారులు ఖాళీ చేయించారు. తల్లిదండ్రులకే ఆ ఇల్లును అప్పగించారు.

father and son relationship family issues, issues for house
తండ్రీకొడుకు మధ్య వివాదం
author img

By

Published : Dec 22, 2021, 10:45 AM IST

father and son relationship family issues : వయోవృద్ధులైన తల్లిదండ్రుల సంక్షేమం చూడకుండా నిర్లక్ష్యం చేస్తున్న కుమారుడి నుంచి ఇంటిని తల్లిదండ్రులకు అప్పగించారు నల్గొండ జిల్లా అధికారులు. దీనికి సంబంధించి మిర్యాలగూడ ఒకటో పట్టణ ఎస్సై అంతిరెడ్డి తెలిపిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. మిర్యాలగూడ పట్టణంలోని హౌసింగ్‌బోర్డు కాలనీకి చెందిన విశ్రాంత ఆర్టీసీ ఉద్యోగి బంటు నర్సయ్య, కమలమ్మ దంపతులకు కుమారుడు శ్రీనివాస్‌, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి అయిన శ్రీనివాస్‌ హైదరాబాద్‌లో భార్యతో కలిసి నివాసం ఉంటున్నాడు. అయితే తన సోదరీమణుల వివాహాల సమయాల్లో ఆస్తి పంపకాల్లో తండ్రి నర్సయ్య తనకు అన్యాయం చేశాడనే కోపంతో తల్లిదండ్రుల బాగోగులు మరిచాడు శ్రీనివాస్‌. పైగా మిర్యాలగూడ పట్టణంలో ఉన్న ఇంటికి తాళం వేసుకుని వెళ్లాడు. దీంతో ఇంటి ముందు తాత్కాలిక ఆవాసం ఏర్పాటు చేసుకుని నివాసం ఉంటున్నారు వృద్ధ దంపతులు.

ఏం జరిగింది?

ఈ క్రమంలో తన కొడుకు పట్టించుకోవడం లేదని ఈ ఏడాది మే 18న నర్సయ్య మిర్యాలగూడ ఆర్డీవోకు ఫిర్యాదు చేశారు. నెలకు రూ.10 వేలు ఇవ్వాలని, మంచిగా చూసుకోవాలని కొడుకు శ్రీనివాస్‌కు ఆర్డీవో సూచించారు. పట్టించుకోక పోగా సివిల్‌ కోర్టులో ఆస్తి పంపకాల వివాదం ఉందంటూ శ్రీనివాస్‌ కేసు దాఖలు చేశాడు. దీంతో ఆర్డీవో ఆదేశాలూ అమలు కావడం లేదని, తమకు ఇబ్బందిగా ఉందని ఆగస్టు 12న నర్సయ్య కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. స్పందించిన కలెక్టర్‌ తల్లిదండ్రుల పోషణ సంక్షేమ చట్టం 2007 ప్రకారం వృద్ధ దంపతులకే ఆ ఇల్లు ఇవ్వాలని అదేనెల 26న ఆదేశాలు జారీ చేశారు. అయితే శ్రీనివాస్‌ సివిల్‌ కోర్టులో దాఖలు చేసిన దావా కారణంగా కలెక్టర్‌ ఆదేశాల అమలులో జాప్యం జరిగింది. వృద్ధుల ఇబ్బందుల దృష్ట్యా.. కలెక్టర్‌ ఆదేశానుసారం జిల్లా మహిళా, శిశు సంక్షేమ, వయోవృద్ధుల శాఖ అధికారులు శ్రీనివాస్‌ను పిలిపించి ఒకటో పట్టణ పోలీసుల సమక్షంలో బంటు నర్సయ్యకు మంగళవారం ఆ ఇంటిని అప్పగించారు.

పెంపుడు తల్లికి ఆశ్రయం

మరోవైపు అదే ఇంట్లో నివాసం ఉంటున్న బంటు నర్సయ్య పెంపుడు తల్లి ఆదెమ్మను ఇంటి నుంచి గెంటివేశారు. కుమారునికి మద్దతు పలుకుతుందనే నెపంతో నర్సయ్య ఆమెను ఇంటి నుంచి బయటకు పంపించారు. ఆదెమ్మ మిర్యాలగూడ ఆర్డీవోను ఆశ్రయించగా... నెలకు రూ. 10,000 పోషణ నిమిత్తం చెల్లించాలని, అదే ఇంట్లో వసతి కల్పించాలని ఆదేశాలు జారీ చేశారు.

తండ్రీకొడుకు మధ్య వివాదం

Bokkamanthulapadu knife attack : నల్గొండ జిల్లా నిడమనూరు మండలం బొక్కమంతుల పాడులో మంగళవారం దారుణం జరిగింది. భార్యాభర్తల మధ్య వివాదాల నేపథ్యంలో కత్తులతో దాడులు చేసుకున్నారు. ఇందులో తీవ్రంగా గాయపడిన కమతం అచ్చమ్మ(60) అనే వృద్ధురాలు మృతి చెందింది. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. కళ్లలో కారం చల్లి.. కత్తులతో దాడి చేసుకున్న ఘటనలో అచ్చమ్మ మృతి చెందగా... ఆమె కుమారుడు, భర్త, అమ్మ పరిస్థితి విషమంగా ఉంది. వారు మిర్యాలగూడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పూర్తి స్టోరీ కోసం క్లిక్ చేయండి.

ఇదీ చదవండి: Conistable Suicide: కుటుంబ సమస్యలతో కానిస్టేబుల్ ఆత్మహత్య

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.