ETV Bharat / state

RAINS: నల్గొండ జిల్లాలో భారీ వర్షం.. లోతట్టు ప్రాంతాలు జలమయం - nalgonda district rains news

రాష్ట్రవ్యాప్తంగా వానలు ప్రారంభమయ్యాయి. వేకువజాము నుంచే పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలుచోట్ల కొనుగోలు కేంద్రాల్లోకి నీరు చేరి ధాన్యం తడిసి ముద్దయింది.

నల్గొండ జిల్లాలో భారీ వర్షం..
నల్గొండ జిల్లాలో భారీ వర్షం..
author img

By

Published : Jun 3, 2021, 10:33 AM IST

నల్గొండ జిల్లాలో భారీ వర్షం..

నల్గొండ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. చండూరు, మునుగోడు, నాంపల్లి, మర్రిగూడ మండలాల్లో తెల్లవారుజాము నుంచే ఉరుములు, మెరుపులతో కూడిన వాన కురుస్తోంది. భారీ వర్షానికి వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి.

నాంపల్లి మండలంలోని శేసిలేటి వాగు, చండూర్ మండలంలోని శిర్దేపల్లి వాగు, బొడంగిపర్తి వాగులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. నాంపల్లి, చండూర్ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో భారీగా నీరు నిలిచిపోయింది. ధాన్యం కుప్పలు తడిచిపోయాయి.

చండూర్ పురపాలికలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. చండూర్​లో డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేకపోవడంతో నీరంతా రోడ్డుపై ప్రవహిస్తోంది. రాకపోకల సాగించేందుకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఇదీ చూడండి: WEATHER REPORT: రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో వర్షాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.