నల్గొండ జిల్లా కేంద్రంలో ఓ మోస్తారు వర్షం పడింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎండ, ఉక్కపోతతో ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేయగా... ఒక్కసారిగా మేఘాలు కమ్ముకుని ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది.
సుమారు అరగంట పాటు చిరు జల్లులు పడగా.... 20 నిమిషాల పాటు ఓ మాదిరిగా వర్షం పడింది. లోతట్టు ప్రాంతాల్లోని మురుగు కాలువలు పొంగి రోడ్లపైకి వచ్చాయి. నల్గొండ మండలంలోని చందనపల్లి, దండంపల్లి, కాంచనపల్లి, కొత్తపల్లి, కత్తాల్గూడ తదితర గ్రామాల్లో భారీ వర్షం కురిసింది.