బంగాళఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం ప్రభావంతో గత మూడు రోజుల నుంచి విరామం లేకుండా విస్తారంగా వర్షాలు కురుస్తున్నారు. నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఇవాళ ఉదయం నుంచి సాయంత్రం వరకు పొడి మబ్బులతో కూడి వాతావరణం ఏర్పడింది.
సాయంత్రం నాలుగున్నర గంటల సమయంలో పట్టణంలో సుమారు గంట పాటు భారీ వర్షంం పడటం వల్ల అక్కడక్కడ కాలనీలలో మురుగు నీరు రోడ్లపైకి చేరింది. ముఖ్యంగా నల్గొండ పట్టణంలో పానగల్ బైపాస్ వద్ద భారీగా నీళ్లు నిలవడం వల్ల వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
ఇదీ చూడండి:వరద బీభత్సం - జనజీవనం అస్తవ్యస్తం