మండు వేసవిలో కురిసిన అకాల వర్షం అన్నదాతలకు తీవ్ర నష్టం మిగిల్చింది. ఆదివారం ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా పలు చోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది. యాదాద్రి జిల్లా వలిగొండ మండలం అప్పరెడ్డిపల్లిలో కొబ్బరి చెట్టుపై పిడుగు పడింది. పలు మార్కెట్ యార్డుల్లో ధాన్యం తడిసిపోయింది. మామిడి తోటలకు తీవ్రనష్టం వాటిల్లింది. దేవరకొండ, తుంగతుర్తి, నకిరేకల్, కనగల్ తదితర మండలాల్లో వర్షం అధికంగా ఉంది.
ఇదీ చదవండి: విద్యుదాఘాతంతో భార్యాభర్తల మృతి