ఎడతెరిపిలోని వర్షాలతో నల్గొండ జిల్లా మిర్యాలగూడలో చెరువులు పొంగిపొర్లుతున్నాయి. ఆది సోమవారాల్లో కలిపి 10.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మండలంలోని రుద్రారం చెరువు అలుగుపోస్తోంది. వేములపల్లి మండలం శెట్టి పాలెం వద్ద చిత్రపరక వాగు రోడ్డుపై ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. వరద నీటితో గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఇదీ చూడండి: భాగ్యనగరంలో వర్షం.. పలు చోట్ల ప్రజలకు ఇక్కట్లు