నల్గొండ జిల్లా దేవరకొండ ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి వాగులు, వంకలు నీటితో పరుగులు పెట్టాయి. దేవరకొండ మండలంలోని పలు చెరువులకు వరద నీరు చేరుతోంది. తీవ్ర వర్షాభావ పరిస్థితులతో చాలా రోజులుగా వట్టిపోయి ఉన్న తాటికోల్, ముదిగొండ, మైనంపల్లి వాగులు ఈ వానతో పరుగులు పెట్టాయి. చాలా కాలం తర్వాత కురిసిన వర్షానికి రైతన్నలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజు తెల్లవారుజామున వరద నీటిని గమనించక ముదిగొండ వాగులోకి వెళ్లిన సాలమ్మ అనే మతిస్తిమితం లేని వృద్ధ మహిళ మరణించింది.
ఇదీ చూడండి : 9నెలల్లో బాబ్రీ కేసు తీర్పు ఇవ్వాలి: సుప్రీం