ETV Bharat / state

జానారెడ్డి గెలిస్తేనే అభివృద్ధి జరుగుతుంది: వీహెచ్

author img

By

Published : Apr 7, 2021, 2:10 PM IST

సాగర్​ ఎన్నికల్లో సౌమ్యుడైన జానారెడ్డిని గెలిపించాలని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు కోరారు. తెరాసను గెలిపిస్తే అభివృద్ధి జరగదని వ్యాఖ్యానించారు. బండి సంజయ్ ఏది పడితే అది మాట్లాడటం తగదంటూ హెచ్చరించారు.

hanumantha-rao-campaign-for-jana-reddy-in-nagarjuna-sagar
జానారెడ్డి గెలిస్తేనే అభివృద్ధి జరుగుతుంది: వీహెచ్

నాగార్జునసాగర్​ ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డి తరఫున కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు ప్రచారంలో పాల్గొన్నారు. హస్తం గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థిస్తూ... స్థానిక ప్రజలతో ముచ్చటించారు. సౌమ్యుడైన జానారెడ్డిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కేసీఆర్ ప్రభుత్వానికి ఒక్క సీటు పోతే ప్రభుత్వం కూలిపోయే ప్రమాదం ఏమి లేదన్నారు. ఒకవేళ ఇక్కడ తెరాస గెలిస్తే ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చని తెలిపారు. ప్రజలు నా వైపే ఉన్నారనే ధీమాతో పట్టించుకోవడం మానేస్తారంటూ ఎద్దేవా చేశారు.

జానారెడ్డిని గెలిపిస్తే హామీలన్నీ అమలు చేసే దిశగా అడుగులు వేస్తారన్నారు. ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో జానారెడ్డిని గెలిపించాలని కోరారు. బండి సంజయ్ ఏది పడితే అది మాట్లాడటం సంస్కారం కాదంటూ సూచించారు. కేంద్ర ప్రభుత్వం చర్యల వల్ల ధరలు అధికంగా పెరిగి చిరు వ్యాపారులు, మధ్య తరగతి ప్రజలు రోడ్డున పడ్డారని వీహెచ్ వ్యాఖ్యానించారు. రైతులను నట్టేట ముంచే చట్టాలను తీసుకువచ్చారని... రెండు వేల నోటు తెచ్చి ధనికులకు మేలు చేశాడని పేర్కొన్నారు.

ఇదీ చూడండి: కొడుకు గెలుపు కోసం తల్లి ఇంటింటి ప్రచారం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.