ETV Bharat / state

'హనుమాన్​పేటలోని ఐసోలేషన్​ కేంద్రాన్ని తీసేయండి'

author img

By

Published : Jul 27, 2020, 10:04 PM IST

స్థానికంగా ఏర్పాటు చేసిన ఐసోలాషన్ కేంద్రాన్ని తీసివేయాలంటూ నల్గొండ జిల్లా హనుమాన్​పేట ప్రజలు ధర్నాకు దిగారు. దాని వల్ల తమకు కరోనా వస్తుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు.

Hanumanpet in Miryalaguda, Nalgonda district Locals staged a dharna to remove the isolation center at
'హనుమాన్​పేటలోని ఐసోలేషన్​ కేంద్రాన్ని తీసేయండి'

నల్గొండ జిల్లా మిర్యాలగూడలో కేసులు అధికంగా పెరుగుతున్న దృష్ట్యా ప్రభుత్వం స్థానిక జ్యోతి హాస్పిటల్​లో కరోనా చికిత్సకు అనుమతి ఇచ్చింది. కాగా దవాఖానా యాజమాన్యం ఫ్లై ఓవర్ వద్ద ఉన్న అతిథి రెసిడెన్సీలో ఐసోలేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. అయితే దాని వల్ల తమకు వ్యాధి సోకుతుందనే భయంతో ఐసోలేషన్​ కేంద్రాన్ని అక్కడి నుంచి తీసివేయాలంటూ స్థానికంగా ఉండే ప్రజలు ఆందోళనకు దిగారు.

వంద పడకలు ఉన్న మిర్యాలగూడ ఏరియా హాస్పిటల్​ని ఉపయోగించుకోకుండా, కరోనా పరీక్షలు నిలిపివేసి ఒక ప్రైవేట్ ఆసుపత్రికి కొవిడ్​ వైద్యానికి అనుమతి ఇవ్వడం బాధాకరమని వారు ఆరోపించారు. తక్షణమే ఐసోలేషన్ కేంద్రాన్ని అక్కడి నుంచి తీసివేయాలని వారు డిమాండ్​ చేశారు. లేదా ఊరికి దూరంగా ఏర్పాటు చేసుకోవాలని లేకుంటే ఆందోళనను ఉద్ధృతం చేస్తామని స్థానికులు హెచ్చరించారు.

ఇవీ చూడండి: రాష్ట్రంలో తగ్గని కరోనా ఉద్ధృతి.. గంటకు 62 పాజిటివ్​ కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.