నల్గొండ జిల్లా చండూరులో చేనేత కార్మికుల శాంతియుత నిరసను పోలీసులు భగ్నం చేయడాన్ని వ్యతిరేకిస్తూ మరికొందరు కార్మికులు ర్యాలీ నిర్వహించారు. దీనికి మాజీ ఎంపీ రాపోలు ఆనంద్ భాస్కర్ హాజరై మద్ధతు తెలిపారు. నాలుగు నెలలుగా కరోనా నేపథ్యంలో చేనేత కార్మికులు ఉపాధి అవకాశాలు కోల్పోయి.. వారి కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయని మాజీ ఎంపీ పేర్కొన్నారు.
వారి గోడును ప్రభుత్వానికి తెలియజేసేందుకు శాంతియుతంగా చేపట్టిన రిలే నిరాహారదీక్షను పోలీసులు భగ్నం చేయడం సమంజసంగా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి వెంటనే నేత కార్మికులను ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి:- రాజధానిలో రోజువారీ కేసుల కన్నా రికవరీలే ఎక్కువ!