Gutta Sukhender Reddy Fires on PM Modi : నిజామాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా ప్రధాన మంత్రి మోదీ ఇచ్చిన ప్రసంగం.. ఆయన స్థాయిని దిగజార్చే విధంగా ఉందని తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి(Gutta Sukhender Reddy) అన్నారు. ప్రధాన మంత్రి హోదాలో ఉన్న వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రిపై అసత్య ఆరోపణలు చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు. నల్లగొండ జిల్లాలోని మిర్యాలగూడ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
Gutta Sukhender Reddy On Modi Speech Nizamabad : వారసత్వ రాజకీయాలకు అంకురార్పణ చేసిందే బీజేపీ అని గుత్తా సుఖేందర్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆ పార్టీ నాయకులు కుటుంబ పాలనపై మాట్లాడం చాలా బాధాకరమని అన్నారు. నిజామాబాద్‌లోని జరిగిన బహిరంగ సభలో ప్రధాని మోదీ అబద్ధాలు చెప్పారని అన్నారు. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి తెలంగాణకు ఒక్కపైసా కూడా కేంద్రం నుంచి రాలేదని తెలిపారు. పైసా ఇవ్వని ప్రధానికి తెలంగాణ గడ్డపై అడుగుపెట్టే అర్హతే లేదని.. అయినా సరే వచ్చిన ప్రధానికి తెలంగాణ గురించి మాట్లాడే అర్హత లేదని వ్యాఖ్యానించారు.
MLC Chairman Gutha Fires on BJP : కాంగ్రెస్, బీజేపీ కల్లబొల్లి మాటలను ప్రజలు నమ్మొద్దు: గుత్తా
Gutta Over Modi Comments on KCR : కేంద్ర సర్కార్ ఇప్పటికీ విభజన హామీలను నెరవేర్చలేదని గుత్తా సుఖేందర్ రెడ్డి గుర్తు చేశారు. పార్లమెంట్ లోపల, బయట తెలంగాణ రాష్ట్రాన్ని మోదీ అవహేళన చేస్తున్నారని మండిపడ్డారు. వెంటిలేటర్ పైన ఉన్న బీజేపీని కాపాడుకోడానికి మోదీ.. ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR), ఆయన కుటుంబ సభ్యులపై ఆరోపణలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపుని ఎవరు అడ్డుకోలేరని.. ముచ్చటగా మూడోసారి బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారుా.
"మంత్రి కేటీఆర్ ఉన్నతమైన విద్యను అభ్యసించిన గొప్ప నాయకుడు.. ప్రజల్లో తనకంటూ ఉన్నతమైన అభిమానాన్ని సాధించుకున్నారు. రాష్ట్రానికి భవిష్యత్తులో తప్పకుండా కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతారు. కేసీఆర్ ఎప్పుడు ముఖ్యమంత్రిని చేయాలనుకుంటే అప్పుడు కేటీఆర్ సీఎం అవుతారు. నిజామాబాద్ జిల్లా పర్యటనలో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాను. ప్రధాని స్థాయిలో ఉండి ముఖ్యమంత్రి ఆరోపణలు చేయడం సబబు కాదు. బీజేపీనే కుటుంబ పాలనకు అంకురార్పణ చేసింది. వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా బీఆర్ఎస్ పార్టీనే వస్తుంది."- గుత్తా సుఖేందర్ రెడ్డి, తెలంగాణ శాసన మండలి ఛైర్మన్
Gutta Reddy Reacts To Modi Nizamabad Speech : అవినీతిపరులు తన పక్కన కూర్చోడానికి బయపడతారని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. ఈడీ, సీబీఐ ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని బీజేపీలో ఎందుకు చేర్చుకుంచున్నారని ప్రశ్నించారు. కేసీఆర్‌ని ముఖ్యమంత్రిని చేయాలంటే మోదీ అశీర్వాదం అవసరం లేదని స్పష్టం చేశారు. అవినీతి చేస్తే ఎందుకు తమపై ఎందుకు విచారణలు చేయలేదని నిలదీశారు. కేవలం రాజకీయ లబ్ధి కోసం తప్పుడు ఆరోపణలు చేయడం సబబు కాదని హితవు పలికారు. ప్రధాని ఒక నియంతలా ఆలోచిస్తున్నారని.. కక్ష పూరితంగా వ్యవహరించడం మంచిది కాదని అన్నారు.
Gutha Sukender on Nalgonda MLA Seats : 'నల్గొండ సీట్లన్నీ బీఆర్ఎస్ పార్టీవే'