Gutha Sukender Reddy on Party Changing : పార్టీ ఆదేశిస్తే వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తాను కానీ.. తన కుమారుడు అమిత్ కానీ పోటీ చేస్తామని శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి తెలిపారు. పార్టీ మారుతున్నానని వస్తున్న ఆరోపణలను ఖండిస్తూ.. ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. తాను పార్టీ మారుతున్నారని కొందరూ పనిగట్టుకొని ప్రచారం చేస్తున్నారని.. అందులో ఎలాంటి వాస్తవం లేదని స్పష్టం చేశారు.
Gutha Sukender Reddy Comments on Congress : స్థానిక ఎమ్మెల్యేలతో ఉన్న భేధాభిప్రాయాలతో కొందరు పార్టీ వీడుతున్నారని.. ఎన్నికల ప్రక్రియలో ఇది సర్వసాధారణమని గుత్తా తెలిపారు. ప్రస్తుతం రాజకీయాల్లో కొత్త ట్రెండ్ నడుస్తోందని.. పాము తన పిల్లలను తాను తిన్నట్లు.. తమ పార్టీ వాళ్లే తమకు ఇబ్బందులు తెస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే కేసీఆర్ మరోసారి సీఎం కావాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. తమ తప్పిదాలను ఇతరులపై నెట్టడం రాజకీయాల్లో సహజమన్న ఆయన ..తనపై కూడా కొన్ని అపవాదాలు, అసత్యాలు ప్రచారం చేశారని చెప్పారు.
Puvvada vs Tummala in Khammam : సమఉజ్జీల సమరం.. ఖమ్మంలో కాకరేపుతున్న పువ్వాడ వర్సెస్ తుమ్మల రాజకీయం
"ప్రతి అంశాన్ని రాజకీయం చేయడమే కాంగ్రెస్ పని. మేడిగడ్డ ప్రాజెక్టు అంశంలో కూడా అదే నడుస్తోంది. మేడిగడ్డ ప్రాజెక్టు విషయంలో రాజకీయం చేయడం మంచిది కాదు. ప్రకృతి వైపరీత్యాలు, సాంకేతిక లోపం వలన వచ్చే సమస్యలపై అభాండాలు వేయడం సరికాదు. తప్పుడు ప్రచారాలు చేసి.. ప్రజలను మోసం చేయొద్దు. రాజకీయ జీవితంలో భేదాభిప్రాయాలతో కొంతమంది విడిపోవచ్చు.. తాత్కాలిక సమస్యలను పట్టించుకోకండా ముందుకు వెళ్లాలి. రాష్ట్రంలో కేసీఆర్ విజయం కోసం అందరూ కలిసి పని చేయాలి. ఆయన విజయమే రాష్ట్ర ప్రజలకు రక్ష. కానీ కొంతమంది స్వార్థం కోసం అసత్యాలు ప్రచారం చేస్తారు. రాజకీయాల్లో సంయమనమే ఫలిస్తుంది." - గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనమండలి ఛైర్మన్
Gutha Sukender Reddy Latest News : తాను ఏ పార్టీలో ఉన్నా.. ఆ పార్టీ నిర్ణయానికి కట్టుబడి పనిచేస్తానని గుత్తా సుఖేందర్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ వయస్సులో తనకు పార్టీలు మారాల్సిన అవరసం లేదని అన్నారు. అవసరమైతే ఈ పార్టీ నుంచే ఇప్పుడే పోటీచేసే వాడినని తెలిపారు. పక్క పార్టీలోని వెళ్లి పోటీ చేయాల్సిన అవసరం లేదని.. తాను ఉన్న పార్టీ నిర్ణయాలకు కట్టుబడి ఉంటానని తేల్చి చెప్పారు. తనపై లేనిపోని నిందలు వేయడం సరికాదని హితవు పలికారు.
MLC Chairman Gutha Fires on BJP : కాంగ్రెస్, బీజేపీ కల్లబొల్లి మాటలను ప్రజలు నమ్మొద్దు: గుత్తా