ETV Bharat / state

Gutha on Karnataka Results : 'కర్ణాటక ఫలితాల తర్వాత కూడా బీజేపీలో మార్పురాలేదు' - గుత్తా తాజా వార్తలు

Gutha Sukender Reddy on Karnataka Results : కర్ణాటక ఫలితాల తర్వాత కూడా బీజేపీలో మార్పురాలేదని శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్​రెడ్డి అన్నారు. కర్ణాటక ప్రజలు బీజేపీకి గుణపాఠం చెప్పారని, ఆ పార్టీకి ప్రజల్లో ఆదరణ తగ్గిపోతోందని తెలిపారు. ఫలితాలొచ్చి 4 రోజులైనా సీఎంను తేల్చక పోవడం కాంగ్రెస్‌ వైఫల్యంగా పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్​ఎస్​ను 100 సీట్లలో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Gutha sukender reddy
Gutha sukender reddy
author img

By

Published : May 16, 2023, 10:29 AM IST

Updated : May 16, 2023, 10:48 AM IST

ఫలితాలొచ్చి 4 రోజులైనా సీఎంను తేల్చక పోవడం కాంగ్రెస్‌ వైఫల్యం

Gutha Sukender Reddy Latest Comments : రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయం వేడెక్కుతోంది. ఈ క్రమంలో అధికార, ప్రతిపక్ష పార్టీలు తమ వ్యూహా, ప్రతి వ్యూహాలకు పదునుపెడుతున్నాయి. ఇప్పటికే పాదయాత్రలు, బహిరంగ సభలు, ఆత్మీయ సమ్మేళనాల పేరుతో పార్టీలన్నీ తెలంగాణను చుట్టేస్తున్నాయి. ప్రతిపక్షాలేమో అధికార పార్టీ వైఫల్యాలు, ఎన్నికల వేళ ఇచ్చిన హామీలను ఎండగడుతూ ప్రజలలోకి వెళుతున్నాయి. మరోవైపు అధికార పార్టీ బీఆర్​ఎస్ మాత్రం తాము గడిచిన 9 ఏళ్లలో చేసిన అభివృద్ధిని చూపిస్తూ హ్యాట్రిక్ విజయం సాధించే దిశగా అడుగులు వేస్తోంది.

ఇదిలా ఉంటే ఇటీవల వెలువడిన కర్ణాటక ఫలితాలలో కాంగ్రెస్ సత్తా చాటడంతో తెలంగాణ కాంగ్రెస్ శ్రేణులలో పుల్ జోష్​ని నింపగా... బీజేపీ శ్రేణులకు మాత్రం తీవ్ర నిరాశను మిగిల్చాయి. తాజాగా కర్ణాటక ఎన్నికల ఫలితాలపై శాసనమండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికలు బీజేపీకి బుద్ధిచెప్పాయని అన్నారు. మరోవైపు కాంగ్రెస్​పైనా విమర్శలు గుప్పించారు.

బీజేపీకి ప్రజల్లో ఆదరణ తగ్గిపోతోంది : కర్ణాటక ఫలితాల తర్వాత కూడా విద్వేష రాజకీయాల్ని రెచ్చగొట‌్టే బీజేపీ ధోరణిలో మార్పు రాలేదని గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. కర్ణాటక ప్రజలు బీజేపీకి గుణపాఠం చెప్పారని, ఆ పార్టీకి ప్రజల్లో ఆదరణ తగ్గిపోతోందని పేర్కొన్నారు. మరోవైపు కర్ణాటకలో ఫలితాలొచ్చి 4 రోజులైనా సీఎంను తేల్చలేక పోవడాన్ని చూస్తే... దేశంలో కాంగ్రెస్‌ పార్టీలో నాయకత్వం స్పష్టంగా కనిపిస్తోందని అన్నారు. రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ నాయకులు అయోమయ స్థితిలోనే ఉన్నారని గుత్తా అభిప్రాయపడ్డారు.

ఈ సారి ఎన్నికల్లో 100 సీట్లు గెలిపించాలి : కేసీఆర్‌ నాయకత్వంలోనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందన్న గుత్తా సఖేందర్‌రెడ్డి... ఈ సారి రాబోయే ఎన్నికల్లో బీఆర్​ఎస్​ను 100 సీట్లలో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వామపక్షాల మద్దతు లేకుండానే రాష్ట్రంలో 2 సార్లు అధికారంలోకి వచ్చామని ఈ సందర్భంగా గుత్తా సఖేందర్‌ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరి సంక్షేమం, రక్షణ కోసం మరోసారి సీఎం కేసీఆర్​ను గెలిపించుకోవాల్సిన బాధ్యత జనాల మీద ఉందన్నారు.

'కర్ణాటక ఫలితాల తర్వాత కూడా బీజేపీలో మార్పులేదు. ఫలితాలు వచ్చి 4 రోజులైనా సీఎంను తేల్చలేని స్థితి కాంగ్రెస్‌ది. రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ నాయకులది అయోమయ స్థితే. కేసీఆర్‌ నాయకత్వంలోనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది. ఈ సారి ఎన్నికల్లో 100 సీట్లు గెలిపించాలి. వామపక్షాలు లేకుండా 2 సార్లు అధికారంలోకి వచ్చాం.'-గుత్తా సుఖేందర్​రెడ్డి, శాసనమండలి ఛైర్మన్‌

ఇవీ చదవండి:

Last Updated : May 16, 2023, 10:48 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.