ETV Bharat / state

Gutha Sukender Reddy: కేంద్రం అలసత్వంతో నదీ జలాల సమస్య దుర్భరం: గుత్తా - తెలంగాణ వార్తలు

కేంద్రం అలసత్వంతోనే నదీ జలాల సమస్య మరింత తీవ్రంగా మారిందని శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆరోపించారు. 1956 నుంచే నీటి దోపిడీ జరుగుతోందని ఆయన విమర్శించారు. అప్పుడు వైఎస్​ రాజశేఖర్ ​రెడ్డి... ఇప్పుడు జగన్ అలాగే వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.

Gutha Sukender Reddy, river water problem
గుత్తా సుఖేందర్ రెడ్డి, నదీ జలాల సమస్య
author img

By

Published : Jun 27, 2021, 2:08 PM IST

గుత్తా సుఖేందర్ రెడ్డి మీడియా సమావేశం

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య నదీ జలాల సమస్య కేంద్ర ప్రభుత్వ అలసత్వం, నిర్లక్ష్యంతోనే దుర్భరంగా మారిందని శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రానికి దక్కాల్సిన కృష్ణా నీటిని 1956 నుంచే దోపిడీ చేస్తున్నారని అన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో పోతిరెడ్డిపాడు నుంచి 55 వేల క్యూసెక్కుల నీటిని దోపిడీ చేశారని విమర్శించారు.

ఇప్పుడు జగన్

నీటి దోపిడీని అప్పట్లోనే వ్యతిరేకించామని... ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణవాదులకు గౌరవం, విలువ ఇవ్వలేదని అన్నారు. అప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి నీటి దోపిడీ చేయగా... ఇప్పుడు ఏపీ సీఎం జగన్ కృష్ణా జలాలను దోచుకుపోవాలనే దుర్బద్ధితో వ్యవహరిస్తున్నారని విమర్శించారు.

నల్గొండ సస్యశ్యామలం

సీఎం కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి కావడంతో ఈ రోజు ఉమ్మడి నల్గొండ జిల్లాలో 2.53 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. రాష్ట్ర ప్రయోజనాలపై భాజపా వాళ్లు ఎందుకు మాట్లాడరు అని ప్రశ్నించారు. రాజకీయ స్వార్థం కోసమే వారి ఆరాటమని మండిపడ్డారు. సీఎం కేసీఆర్​పై, రాష్ట్ర ప్రభుత్వంపై బురద చల్లడమే వాళ్ల పని అని విమర్శించారు.

భాజపా నాయకులు తెరాసను విమర్శించడమే పనిగా పెట్టుకున్నారు. రాష్ట్రంలో ఎన్నో సమస్యలున్నా వాటిపై ప్రశ్నించరు. ఇప్పటికైనా కేంద్రం స్పందించి... నదీ జలాలు, ఆస్తుల పంపకం, విభజన చట్టంలోని సమస్యలను పరిష్కరించాలి. టీపీసీసీ అధ్యక్షుడిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి పోయి... ఉత్తర కుమారుడు వచ్చారు. కాంగ్రెస్​ను అధికారంలోకి తేవడమే తన పని అని రేవంత్ రెడ్డి కలలు కంటున్నారు. కాంగ్రెస్​లో సంసారం సరిదిద్దుకోవడమే సరిపోతుంది. ఆ పార్టీని అధికారంలోకి తేవడం కలలు మాత్రమే. ప్రపంచంలోనే అతిపెద్ది ప్రాజెక్టును ఏర్పాటు చేసిన ఘనత సీఎం కేసీఆర్​కే దక్కుతుంది. కాళేశ్వరం ప్రాజెక్టుతో రాష్ట్రం సస్యశ్యామలంగా మారింది.

-గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసన మండలి ఛైర్మన్

ఇదీ చదవండి: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డికి అభిమానుల శుభాకాంక్షల వెల్లువ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.