విద్యార్థులకు విద్యతోపాటు సాంకేతికత, చేతివృత్తులపై.. శిక్షణ భవిష్యత్తులో బంగారు బాటలు వేస్తుందని సాంఘిక సంక్షేమ గురుకుల సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. దేవరకొండలో జ్యూట్ బ్యాగ్స్ శిక్షణ పూర్తి చేసుకున్న నాగర్ కర్నూల్ జిల్లా తెలకపల్లి గురుకులాల విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేశారు.
నల్గొండ జిల్లా దేవరకొండలో రిటైర్డ్ ఉద్యోగుల సంఘం భవనంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, బీసీ గురుకుల సెక్రటరీ మల్లయ్య బట్టు హాజరయ్యారు. విద్యా, ఉపాధి కల్పనకు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.
నేర్చుకున్న శిక్షణను వ్యాపార రంగంగా మార్చుకోవాలని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సూచించారు. కార్యక్రమానికి గ్రీన్ మ్యారేజ్ యూత్ క్రియేషన్స్ అధ్యక్షురాలు పున్న ఉమామహేశ్వరి, ఏఆర్డీఎస్ అధ్యక్షులు ఖాజా ఖైరత్, సాంఘిక సంక్షేమ గురుకుల అసిస్టెంట్ సెక్రటరీ షక్రు నాయక్ హాజరయ్యారు.
ఇదీ చూడండి: పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు గౌరవ వీడ్కోలు