ETV Bharat / state

ప్రజాప్రతినిధిపై అటవీ భూముల కబ్జా ఆరోపణలు

అటవీభూములను ఓ ప్రజాప్రతినిధి కబ్జా చేస్తున్నాడని నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం తిమ్మాపురం గ్రామస్థులు ఆరోపించారు. 10 ఎకరాల స్థలాన్ని ఆక్రమించి... ఎకరాన్ని రూ. 6 లక్షలకు అమ్ముకున్నాడని వారు చెప్తున్నారు.

forest land trespass
forest land trespass
author img

By

Published : Apr 26, 2020, 1:58 PM IST

నల్గొండ జిల్లా దామరచర్ల మండలం తిమ్మాపురం శివారులోని అటవీ భూములను ఓ ప్రజాప్రతినిధి కబ్జా చేస్తున్నాడని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. స్థానికంగా పట్టు ఉన్న ఓ ప్రజాప్రతినిధి 3 సంవత్సరాల క్రితం పది ఎకరాల ఫారెస్ట్ భూమిని ఆక్రమించుకున్నారని తెలిపారు. ఆ స్థలాన్ని చదును చేసి 2019లో ఎకరాన్ని రూ. ఆరు లక్షలకు అమ్ముకున్నారని గ్రామస్థులు చెప్పారు.

ప్రస్తుతం మరో 20 ఎకరాల అటవీ భూమిని రాత్రిపూట జేసీబీలు, డోజర్ల సాాయంతో చదును చేస్తున్నారన్నారు. అటవీ అధికారులకు ఈ విషయాన్ని చెప్తే... ఒక వాహనాన్ని సీజ్ చేసి నామమాత్రపు ఫైన్​తో సరిపెట్టారని గ్రామస్థులు పేర్కొన్నారు. సదరు ప్రజాప్రతినిధిపై చర్యలు తీసుకొని అటవీ భూములను కాపాడాలని తిమ్మాపురం, బడాయిగడ్డ గ్రామస్థులు మిర్యాలగూడ ఆర్డీవోకి ఫిర్యాదు చేశారు.

ఇదీ చదవండి: 'వేసవిలో భారత్​ కరోనాను జయించొచ్చు!'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.