ETV Bharat / state

Food : పది రూపాయలకే భోజనం.. జైళ్లశాఖ ఔదార్యం - food for only ten rupees in nalgonda

ఈరోజుల్లో.. పది రూపాయలకు కనీసం మంచినీళ్లు, చాయ్ కూడా రావు. అలాంటిది పది రూపాయలకే రుచికరమైన భోజనం లభిస్తోంది. నల్గొండ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో. జిల్లా జైలు శాఖ ఆధ్వర్యంలో రోగులకు సాయంగా వచ్చే వారికి పది రూపాయల్లోనే ఆరోగ్యకరమైన భోజనాన్ని అందిస్తున్నారు.

food-for-only-ten-rupees-in-nalgonda-district
పది రూపాయలకే భోజనం
author img

By

Published : Jul 16, 2021, 11:56 AM IST

వివిధ ఆరోగ్య సమస్యలతో నల్గొండ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ఆసుపత్రికి నిత్యం వందల సంఖ్యలో రోగులు వస్తుంటారు. ఆసుపత్రిలో చేరిన రోగులకు ఆహారం అందిస్తారు. కానీ వారి వెంట సాయంగా వెళ్లే.. కుటుంబ సభ్యులు మాత్రం బయటే తినాల్సిన పరిస్థితి. కొందరు ఆసుపత్రికి వచ్చేటప్పుడే భోజనం తీసుకొస్తారు. మరికొందరు బయట హోటళ్లో తింటారు.

పది రూపాయలకే భోజనం

కడుపు మాడ్చుకోవాల్సిందే..

ఆసుపత్రిలో రోగి వెంట ఎక్కువ రోజులు ఉండాల్సి వచ్చిన పరిస్థితుల్లో మాత్రం భోజన సదుపాయం లేక కుటుంబ సభ్యులు ఇబ్బందులు పడుతున్నారు. ఇంటి నుంచి భోజనం తీసుకురాలేని పరిస్థితి.. మరోవైపు హోటళ్లో తినే స్థోమత లేక ఆకలితో కడుపు మాడ్చుకోవాల్సిన దుస్థితి.

ఖైదీలే వంటవారు..

రోగుల వెంట వచ్చే సహాయకులు ఆకలితో అలమటించకుండా.. నల్గొండ జిల్లా జైల్ శాఖ ఓ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఆసుపత్రికి వచ్చే వారికి పది రూపాయల్లోనే రుచికరమైన నాణ్యతతో కూడిన భోజనాన్ని అందిస్తోంది. ఈ భోజనాన్ని జిల్లా జైల్​లో ఉన్న ఖైదీలే వండుతారు. వారే ఆస్పత్రికి తీసుకువచ్చి విక్రయిస్తారు. లాక్​డౌన్ వల్ల కొంత కాలం ఆగిపోయిన ఈ సేవలు.. ఈనెల 8న తిరిగి ప్రారంభమయ్యాయి.

నా భార్య కాన్పు కోసం ఆసుపత్రికి వచ్చాం. వారం రోజుల నుంచి ఆసుపత్రి వద్దే ఉంటున్నాను. మా దగ్గర డబ్బుల్లేకనే ప్రభుత్వాసుపత్రికి వచ్చాం. మా లాంటి పేదలు ప్రభుత్వాసుపత్రికి వచ్చినప్పుడు భోజనానికి చాలా ఇబ్బంది అవుతోంది. బయట తినాలంటే చాలా ఖర్చవుతోంది. బయట ఒక ప్లేట్ మీల్స్​కే దాదాపు రూ.60 ఉంది. జైళ్ల శాఖ ఆధ్వర్యంలో అందిస్తోన్న పది రూపాయల భోజనంతో మా సమస్య తీరింది. ఖర్చు తగ్గింది. భోజనం రుచికరంగా ఉంది. చాలా మంది డబ్బులేక ఒకపూట తిని మరో పూట కడుపు మార్చుకునేవాళ్లుంటారు. జైళ్ల శాఖ అందిస్తోన్న ఈ భోజనంతో ఇక రోగుల వెంట వచ్చిన వారెవరూ ఆకలితో అలమటించరు.

గణేశ్, భార్య కాన్పు కోసం ఆసుపత్రికి వచ్చిన వ్యక్తి

కలెక్టర్ కోటా నిధులతో..

2017లో అప్పటి కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ తన కోటా నిధుల నుంచి రూ.12 లక్షలకు పైగా ఖర్చు చేసి వంట పాత్రలు కొనుగోలు చేశారు. అప్పటి నుంచి నల్గొండ జిల్లా జైలులో ఉన్న ఖైదీలతో వంట చేయించి.. ఆసుపత్రిలోని రోగులకు అందజేస్తున్నారు.

ఖైదీలకు జీవనోపాధి కల్పించేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతోంది. జైళ్లో ఉన్న ఖైదీలు వారి ఇంటి ఖర్చులకు డబ్బు పంపేందుకు ఇది తోడ్పడుతోంది. అలాగే రోగుల వెంట వచ్చిన వారి ఆకలీ తీరుస్తోంది. గత కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ సాయంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం.

ఎల్.దేవ్లా, జైల్ సూపరింటెండెంట్

రోజుకు 100 నుంచి 200 మందికి భోజన సదుపాయం కల్పిస్తున్నట్లు జైలు శాఖ అధికారులు తెలిపారు. రోగులకు సాయంగా ఉండటానికి వచ్చే వారు.. సాధారణ పరిస్థితుల్లోనే బయట తినే అవకాశం లేదు. కరోనా కోరలు చాచిన ప్రస్తుత పరిస్థితుల్లో బయట భోజనం కన్నా.. పరిశుభ్ర వాతావరణంలో జైలు ఖైదీలు రుచికరంగా వండుతున్న ఈ భోజనం తినడం ఆరోగ్యానికి మంచిదని ఆసుపత్రి సూపరింటెండెంట్ చెప్పారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.