నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి సమీపంలోని విద్యుత్తు ఉప కేంద్రంలో పేలుడు సంభవించింది. హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి పక్కనే భారీ స్థాయిలో మంటలు రావటం వల్ల స్థానికులు భయందోళనకు గురయ్యారు. కామినేని ఆసుపత్రికి అత్యంత సమీపంలో ఉన్న ఉప కేంద్రంలో నియంత్రికలు పేలిపోయి ఈ మంటలు సంభవించినట్లు అధికారులు తెలిపారు.
సమాచారం అందుకున్న అగ్ని మాపక యంత్రాంగం మంటలను అదుపులోకి తెచ్చారు. కామినేని ఆసుపత్రి, నార్కట్పల్లితోపాటు మండలంలోని వివిధ గ్రామాలకు ఈ ఉప కేంద్రం సేవలందిస్తోంది. ఈ ప్రమాదంతో రాత్రి వరకు ఆయా ప్రాంతాలకు విద్యుత్తు సరఫరాను నిలిపివేయనున్నట్లు అధికారులు వెల్లడించారు.