ETV Bharat / state

Fever: విష జ్వరాల కలవరం.. కలుషిత నీరే కారణమా.? - diseases in nadikuda village

ఆ గ్రామాన్ని విష జ్వరాలు కలవరపెడుతున్నాయి. ఒక్కో కుటుంబంలో ఇద్దరికి పైగా వ్యాధుల బారిన పడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. నల్గొండ జిల్లా నడికుడలో గతేడాది ఇదే పరిస్థితి నెలకొనగా.... మళ్లీ జ్వరాలు వస్తుండటంతో గ్రామస్థులు భయాందోళనకు గురవుతున్నారు. అధికారులు వైద్య శిబిరం ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.

fevers in nadikuda
నడికుడలో విష జ్వరాలు
author img

By

Published : Aug 10, 2021, 4:43 AM IST

నల్గొండ జిల్లా గుర్రంపోడు మండలం నడికుడలో 2500 పైగా ఓటర్లు ఉన్నారు. గతేడాది జూన్ నుంచి గ్రామంలో విష జ్వరాల విజృంభణతో గ్రామస్థులు వణికిపోతున్నారు. బాధితులకు చికిత్స కోసం మండల వైద్య బృందం ఆధ్వర్యంలో శిబిరం ఏర్పాటు చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. మళ్లీ ఇప్పడు కూడా గ్రామంలో దాదాపుగా అందరూ విష జ్వరాల బారిన పడ్డారు. దీంతో గ్రామస్థులు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. ఓ వైపు కరోనా భయం, మరో వైపు విష జ్వరాలతో ఊరు అల్లాడిపోతుంది.

వ్యర్థాలతో కలవరం

నడికుడలో ఎక్కడి చెత్త అక్కడే.. గ్రామంలో పెరిగిన కంప చెట్లు, వీధుల్లో పారుతున్న మురుగు నీరు.. ఫలితంగా దోమల బెడద పెరిగి విష జ్వరాలు సోకుతున్నాయి. ఊరి నడిబొడ్డున నిరుపయోగంగా రెండు బావులు ఉన్నాయి. చికెన్ సెంటర్ల వ్యర్థాలు, వాడి పడేసిన సిరంజీలు, చెత్తా చెదారాలను ఆ బావుల్లో నింపుతున్నారు. వీధుల్లో ప్రత్యేకంగా మురుగునీరు వ్యవస్థ లేకపోవడంతో ఇళ్లలోని వ్యర్థపు నీరు వీధుల్లోకి పారుతోంది. ఫలితంగా గ్రామం నిండా దోమలు చెత్తాచెదారంతో మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్​ బారిన పడుతున్నామని గ్రామస్థులు వాపోతున్నారు. పారిశుద్ధ్యం సహా దోమల నివారణకు పంచాయతీ సిబ్బంది చర్యలు చేపట్టడం లేదని స్థానికులు ఆరోపించారు.

నడికుడలో విష జ్వరాల కలవరం

నడికుడతో పాటు మిర్యాలగూడ మండలంలోని జంకు తండా, మాలోతు తండాలో జ్వరాలతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. జంకుతండాలో రెండ్రోజుల క్రితం జ్వరంతో బాధపడుతూ ఓ బాలిక మృతిచెందగా.. ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మరణించిన బాలిక ఇంట్లోనే ముగ్గురు బాధితులు ఉన్నారు. సుమారు 30మందికి పైగా జ్వరాలు రాగా... ఇందులో అధికంగా చిన్నారులు ఉన్నారు.

గ్రామంలో మురుగు నీరు, వ్యర్థాల కారణంగా దోమలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఇంట్లో ఒక్కరికి జ్వరం వచ్చినా మిగిలిన వారికీ సోకుతోంది. ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స తీసుకునే స్తోమత లేదు. దయచేసి ప్రభుత్వం, అధికారులు చొరవ తీసుకొని ఊళ్లో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయాలి. మున్ముందు ఎలాంటి విష జ్వరాలు సోకకుండా గ్రామంలో పారిశుద్ధ్య పనులు చేపట్టాలి. -గ్రామస్థులు

ఊరు ఊరంతా

విష జ్వరాలు ప్రబలడంతో అందరూ మంచం పట్టారు. ఒక్కో కుటుంబంలో ఇద్దరికి పైగా రోగాలు సోకడంతో చికిత్స కోసం జిల్లా కేంద్రంలోని ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్తే జేబులు గుల్ల అవుతున్నాయని ఊరి ప్రజలు వాపోతున్నారు. వైద్యం కోసం అప్పులు చేయాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. విష జ్వరాలతో పాటు కీళ్ల నొప్పులు, వాంతులు, విరేచనాలు అవుతున్నాయని చెప్పారు. గ్రామంలో తాగునీరు కలుషితమవుతుందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని చెప్పారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో వేలాది రూపాయలు పెట్టి చికిత్స తీసుకోలేక గ్రామంలో ఉన్న ఆర్​ఎంపీల వద్ద చికిత్స తీసుకుంటే తగ్గడం లేదని వెల్లడించారు. ఇప్పటికైనా జిల్లా వైద్య బృందం చికిత్స కోసం శిబిరాన్ని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.

ఇదీ చదవండి: DGP Mahender Reddy : పోలీసు శాఖలో పక్షపాత వైఖరికి తావులేదు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.