ETV Bharat / state

సన్నాల అవస్థ: 'వందల మందిలో 50మందికే టోకెన్లు' - నల్గొండ జిల్లా వార్తలు

రాష్ట్రంలో సన్నరకం వరిసాగు చేసిన అన్నదాతల తిప్పలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. వాటి సాగులో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్న రైతులకు ధాన్యాన్ని అమ్మడం గగనంగా మారింది. కోతలు పెరుగుతున్న తరుణంలో కోతలు, కొనుగోలు ప్రక్రియలకు అధికారులు టోకెన్లు ఇస్తున్నారు. వాటికోసం ఉదయం 4 గంటల నుంచే రైతులు బారులు తీరుతున్నారు. అయినా ఫలితం లేదని అన్నదాతలు వాపోతున్నారు.

farmers waiting for tokens in front of  agriculture office in nalgonda district
సన్నాల అవస్థ: 'వందల మందిలో 50మందికే టోకెన్లు'
author img

By

Published : Nov 11, 2020, 11:59 AM IST

Updated : Nov 11, 2020, 1:02 PM IST

రైతులకు సన్నధాన్యం కష్టాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. వరి కోతలు ముమ్మరం అవుతున్న తరుణంలో పోలీసులు, రెవెన్యూశాఖ, వ్యవసాయశాఖల సమన్యయంతో ధాన్యం కోత, అమ్మడం కోసం టోకెన్లను విడుతల వారీగా ఇస్తున్నారు. వాటికోసం నల్గొండ త్రిపురారం మండల కేంద్రంలో ఉన్న వ్యవసాయ కార్యాలయం ఎదుట రైతులు బారులు తీరారు. ఉదయం 4 గంటల నుంచి లైన్​లో వేచి ఉన్నామని, 50 టోకెన్లు మాత్రమే ఇస్తున్నారని అన్నదాతలు వాపోయారు.

దాదాపు 300 మంది రైతులు టోకెన్ల కోసం ఎదురు చూస్తున్నారు. అధికారులు సమయానికి రావడం లేదని, వరి కోత యంత్రాలు దొరక్క ఇబ్బంది పడుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పొలాల్లో ఉండాల్సిన తాము ఉదయమే మండలానికి రావాలి అంటే ఇబ్బందిగా ఉందని విచారం వ్యక్తం చేస్తున్నారు.

సన్నాల అవస్థ: 'వందల మందిలో 50మందికే టోకెన్లు'

"సీఎం కేసీఆర్ సూచనతో సన్నరకాలు సాగు చేసి తీవ్రంగా నష్టపోయాం. టోకెన్లు ఇచ్చినా ట్రాక్టర్​లో ధాన్యం తీసుకొని పోయి మిల్లులో తిండి తిప్పలు లేకుండా మూడు నాలుగు రోజులు ఇబ్బందులు పడుతున్నాం. వాన పడితే పట్టాలు లేక ధాన్యం తడిస్తే... తడిసిన ధాన్యాన్ని తక్కువ ధరకు అడుగుతున్నారు. కోతకు టోకెన్లు పెట్టడం వల్ల యంత్రాలు సమయానికి వస్తలేవు. ఇతర రాష్ట్రాల యంత్రాలు ఇక్కడకు రావడానికి అనుమతిస్తారు కానీ కోతకు అనుమతి లేదంటారు. అధికారులు సమయానికి రాకపోవడం వల్ల చిన్నలు, పెద్దలు చాలా ఇబ్బందులు పడుతున్నాం. అధికారులు స్పందించి మాకు న్యాయం చేయాలి."

-రైతు

"టోకెన్ల వల్ల చాలా ఆలస్యం అవుతుంది. ఉదయం వచ్చినా అవి దొరుకుతాయనే నమ్మకం లేదు. సన్నరకాల సాగుతో మాకు నష్టాలే కానీ లాభాలు లేవు. మిల్లుకు పోతే గిట్టుబాటు ధర ఇవ్వడం లేదు. రోజుకు 50 టోకెన్లు మాత్రమే అంటున్నారు. టోకెన్ల సంఖ్య పెంచాలి."

-మహిళా రైతు

ఇదీ చదవండి: 12 శాతం కంటే తేమ ఎక్కవగా ఉంటే కొనేది లేదు: సీసీఐ

Last Updated : Nov 11, 2020, 1:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.