సన్నధాన్యం విక్రయాల కోసం నల్గొండ జిల్లా అధికారులు అమలు చేస్తోన్న టోకెన్ల విధానం గందరగోళానికి దారితీస్తోంది. సరైన రీతిలో టోకెన్లు ఇవ్వడం లేదంటూ నిన్న ఆందోళన బాట పడితే... ఈరోజు అసలు టోకెన్లే ఇవ్వడం లేదంటూ రైతులు ధర్నాకు దిగారు.
ఈ మేరకు వేములపల్లి ఎంపీడీవో కార్యాలయం ఎదుట బైఠాయించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయం ముందు రాస్తారోకో చేశారు.
నిన్న ఉదయం టోకెన్ల కోసం కార్యాలయానికి వస్తే సీరియల్ నంబరు రాయించుకొని టోకెన్లు రేపు ఉదయం ఇస్తామని అధికారులు చెప్పారని రైతులు చెప్పారు. కానీ ఈరోజు రాగానే టోకెన్లు ఇవ్వడం కుదరదని, మళ్లీ రేపు రమ్మంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజు టోకెన్లు ఇస్తారని లోడు తీసుకొని వస్తే వీళ్లు మొండి చేయి చూపిస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
నిన్న ఒక్కరోజు మాత్రమే టోకెన్లు ఇచ్చి, ఇవాళ అయిపోయాయని చెప్పడంపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: 'రైతుల వెన్ను విరుస్తున్న వ్యవసాయ చట్టాలు'