ETV Bharat / state

సన్నరకానికి మద్దతు ధర చెల్లించని మిల్లర్లపై టాస్క్​ఫోర్స్ కొరడా

నల్గొండ జిల్లాలో సన్నరకం ధాన్యాన్ని తక్కువ ధరకు కొనుగోలు చేసిన మిల్లర్లపై అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర కంటే తక్కువకు కొంటున్న మిల్లులను సీజ్ చేస్తున్నారు. సన్నరకాల దిగుబడులు పెద్ద ఎత్తున ఉన్నా.. సరైన ధరలు లేకపోవడం వల్ల రైతులు ఆవేదన చెందుతున్నారు.

farmers protest in nalgonda distric
నల్గొండ జిల్లాలో రైతుల ఆందోళన
author img

By

Published : Nov 3, 2020, 8:09 AM IST

రాష్ట్రంలో గత సీజన్లలో సన్నరకం ధాన్యం క్వింటాలుకు 2 వేల నుంచి 2 వేల 2 వందలు పలికేంది. నియంత్రిత సాగు విధానం అమల్లోకి వచ్చిన తర్వాత నల్గొండ జిల్లాలో సన్న రకం ధాన్యం భారీగా సాగైంది. కానీ ధరపై ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇవ్వకపోవడం వల్ల మిల్లర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. దొడ్డు రకం వరికి దిగుబడి ఎక్కువ.. ఖర్చు తక్కువ... సన్నరకానికి ఖర్చు ఎక్కువ... దిగుబడులు తక్కువుంటాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సన్నరకాలను కొనుగోలు చేయాలన్న ఆదేశాలు రాకపోవడం వల్ల అధికారులు ఏం చేయలేకపోతున్నారు.

మిల్లర్ల తీరుపై అధికారుల ఆగ్రహం

ప్రస్తుతం ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనే పరిస్థితి లేక.. రైతులు మిల్లర్లను ఆశ్రయిస్తున్నారు. ఇదే అదనుగా భావిస్తున్న వ్యాపారులు ధరలను తగ్గిస్తున్నారు. మిల్లర్ల తీరుపై ఆగ్రహించిన అధికారులు టాస్క్‌ఫోర్స్ బృందాలు ఏర్పాటు చేశారు. మద్దతు ధర ఇవ్వని మిల్లర్లపై చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తూ.. మిర్యాలగూడలోని బాలాజీ రైస్ మిల్లును సీజ్ చేశారు.

ఆందోళన బాటలో అన్నదాత

జిల్లాలో మొత్తం 287 కేంద్రాలుండగా.. సన్నరకం ధాన్యాన్ని మద్దతు ధరకే కొంటారని రైతులు భావించారు. కానీ ప్రభుత్వం సన్నాలను కొనుగోలు చేయక.. మిల్లర్లు ధర తగ్గించడం వల్ల చేసేదేంలేక అన్నదాతలు ఆందోళన బాట పడుతున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.