ETV Bharat / state

వైద్యుల నిర్లక్ష్యంతో కుమారుడు మరణించాడని కుటుంబసభ్యుల ఆందోళన - ఆస్పత్రి ఎదుట మృతదేహం అప్పగించాలని కుటుంబసభ్యుల ఆందోళన

చెప్పినంతా డబ్బు చెల్లిస్తేనే మృతదేహం అప్పగిస్తామని వైద్యులు తెలపడం వల్ల బాధితులు ఆసుపత్రి ముందు ధర్నాకు దిగారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే తమ కుమారుడు మరణించాడని కుటుంబసభ్యులు ఆరోపించారు. పోలీసులు వచ్చి ఇరువర్గాలకు నచ్చజెప్పడం వల్ల గొడవ సద్దుమణిగింది.

వైద్యుల నిర్లక్ష్యంతో మరణించాడని కుటుంబసభ్యుల ఆందోళన

author img

By

Published : Sep 30, 2020, 9:33 PM IST

నల్గొండ జిల్లా దేవరకొండ తాలూకా పెద్ద తండా గ్రామానికి చెందిన లోక్య నాయక్ (33)కు శ్వాసకోశ సంబంధిత సమస్య వచ్చింది. దీంతో ఈ నెల 20న హైదరాబాద్​ అబిడ్స్​లోని ఉదయ్ ఓమ్ని ఆసుపత్రిలో చేర్పించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కరోనా పాజిటివ్ వచ్చిందని వైద్యులు చికిత్స ప్రారంభించారని పేర్కొన్నారు. పది రోజుల అనంతరం వైరస్​ తగ్గిందని రాత్రి డిశ్చార్జ్​ చేస్తామని హాస్పిటల్ సిబ్బంది చెప్పినట్లు వారు పేర్కొన్నారు.

అయితే పెండింగ్​లో ఉన్న రూ. ఐదున్నర లక్షలు చెల్లించాలని ఆసుపత్రి సిబ్బంది చెప్పారని.. తాము డబ్బులు సర్దుకొనేందుకు కొంత సమయం కావాలని కోరినట్లు వివరించారు. వారు అడిగినంత డబ్బులు చెల్లించలేదనే కారణంతో.. లోక్య నాయక్​కు వైద్యం అదించలేదని సోదరుడు శంకర్ నాయక్​ ఆరోపించాడు. అందువల్లే బుధవారం ఉదయం తమ సోదరుడు మృతి చెందినట్లు శంకర్ నాయక్​ కన్నీరు పెట్టుకున్నాడు.

ఇప్పటి వరకు రూ. లక్షన్నర కట్టామని.. మిగిలిన డబ్బు చెల్లిస్తేనే మృతదేహాన్ని ఇస్తామనడం వల్ల ఆందోళనకు దిగారు. ఈ ఘటనతో అబిడ్స్ పోలీసులు హాస్పిటల్ వద్దకు చేరుకొని ఆసుపత్రి యాజమాన్యంతో మాట్లాడారు. మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించడం వల్ల వారు ఆందోళన విరమించారు.

ఇదీ చదవండి: 'రాంకీ సంస్థకు చెత్త సేకరణ టెండర్​ ఇవ్వడాన్ని రద్దు చేసుకోవాలి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.