ETV Bharat / state

రూ.30 లక్షల నకిలీ విత్తనాల పట్టివేత... 23 మంది అరెస్టు

నల్గొండ జిల్లాలో నకిలీ విత్తనాల అమ్మకాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. జిల్లా పోలీసులు భారీ అంతర్రాష్ట్ర నకిలీ విత్తనాల రాకెట్​ను ఛేదించారు. ఇందుకు సంబంధించి 23 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 30లక్షల విలువైన 15 క్వింటాళ్ల పత్తి విత్తనాలను, వాటిని ప్యాక్ చేసే మెషినరీ సామగ్రిని, చరవాణులను స్వాధీనం చేసుకున్నారు.

fake cotton seeds caught in nalgonda district
నల్గొండ జిల్లాలో భారీగా నకిలీ పత్తి విత్తనాల పట్టివేత
author img

By

Published : Jun 23, 2020, 8:16 PM IST

నల్గొండ జిల్లాలో నకిలీ విత్తనాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. 30 లక్షల రూపాయల విలువైన నకిలీ విత్తనాలను పోలీసులు పట్టుకున్నారు. అంతర్రాష్ట్ర నకిలీ విత్తనాల రాకెట్​ను నల్గొండ జిల్లా పోలీసులు ఛేదించారు. నాలుగు ప్యాకెట్ల నకిలీ విత్తనాల తీగ లాగితే 15 క్వింటాళ్ల వరకు నకిలీ విత్తనాల బండారం బయటపడింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో నకిలీ విత్తనాలు విక్రయిస్తున్న 23 మంది సభ్యుల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. నకిలీ విత్తనాలతో పాటు కారు, ఆటో, విత్షనాలను ప్యాక్​ చేసే మెషినరీ, కాంటాలు, ప్యాకెట్లు, చరవాణులను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. .

మొదట నల్గొండ జిల్లా మునుగోడు మండలం పోలీస్​ స్టేషన్ పరిధిలో గుర్తించిన నాలుగు నకిలీ పత్తి విత్తనాల ప్యాకెట్ల ద్వారా పోలీసులు ప్రారంభించిన దర్యాప్తులో తీగ లాగితే మొత్తం డొంక కదిలింది.నకిలీ విత్తనాల తయారీదారులు మొదలుకొని డిస్ట్రిబ్యూషన్​​ నెట్​వర్క్​, సీడ్స్ పండిస్తున్న రైతులను కూడా గుర్తించి సమగ్ర దర్యాప్తు చేస్తున్నట్లు నల్గొండ ఎస్పీ రంగనాథ్​ తెలిపారు. ఈ మేరకు గద్వాల జోగులాంబ, నాగర్ కర్నూల్ జిల్లాలకు చెందిన పలువురిని అదుపులోకి తీసుకున్నారు.

వారిని విచారిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నంద్యాలకు చెందిన మరికొందరి పాత్ర బయటపడింది. వారిని కూడా అరెస్ట్ చేశారు. అనుమతి లేని బిజీ2,400 ప్యాకెట్లు, బిజీ3 108 ప్యాకెట్లు, సర్పంచ్ గోల్డ్ 595 ప్యాకెట్లు, 96 రాజ్ కోట్ 152 ప్యాకెట్లు మొదలైన నకిలీ విత్తనాలను స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ తెలియజేశారు. వారిపై పీడీ యాక్టు కింద కేసు నమోదు చేస్తామని తెలిపారు.

ఇవీ చూడండి: ఉద్రిక్తత: ఒంటిపై పెట్రోల్ పోసుకుని యువకుల నిరసన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.