ETV Bharat / state

'రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో నెట్డడంలో కేసీఆర్ ముందున్నారు' - Dr. Cheraku Sudhakar latest news

తెలంగాణ ప్రభుత్వంపై డా.చెరకు సుధాకర్ విమర్శలు చేశారు. ప్రజలను తాగించడమే లక్ష్యంగా పెట్టుకున్న కేసీఆర్.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో ఉంచడంలో సీఎం ముందున్నారని దుయ్యబట్టారు.

Dr. Cheraku Sudhakar at the graduation meeting at Sagar Hill Colony
సాగర్ హిల్​కాలనీలో పట్టభద్రుల సమావేశంలో డా.చెరకు సుధాకర్
author img

By

Published : Jan 5, 2021, 6:43 PM IST

తెలంగాణ ప్రజలను తాగించడమే లక్ష్యంగా పెట్టుకున్న సీఎం కేసీఆర్.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మళ్లీ గెలవాలని చూస్తున్నారని డా.చెరకు సుధాకర్ విమర్శించారు. మద్యం అమ్మకాలపై వచ్చే రాబడితో ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారని ఆరోపించారు.

నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా స్వతంత్ర అభ్యర్థిగా సాగర్ హిల్​కాలనీలో సమావేశం నిర్వహించారు. అధిక విద్యుత్ వాడకమే రాష్ట్ర అభివృద్ధి అని చెప్పడం తప్పన్నారు.

బంగారు తెలంగాణ అని చెప్పి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో ఉంచడంలో కేసీఆర్ ముందున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాసను గెలిపించకూడదు. ప్రశ్నించే గొంతులను మండలికి పంపించాలి. నాకు మొదటి ప్రాధాన్యత ఓటువేసి గెలిపించాలని కోరుతున్నా.

-డా.చెరకు సుధాకర్

ఇదీ చూడండి: ఓటుకు నోటు కేసులో కోర్టుకు హాజరైన రేవంత్‌రెడ్డి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.