అవినీతికి కేసీఆర్ ప్రభుత్వం కేరాఫ్‌గా నిలిచిందని భాజపా నేత డీకే అరుణ ఆరోపించారు. మొన్నటి వరకు సర్వేల పేరుతో ఉద్యోగులను కార్యాలయాలకు దూరంగా ఉంచారని.. ఇప్పుడు శాఖల విలీనంతో వారికి కొత్త సమస్యలు తెస్తున్నారని విమర్శించారు. నల్గొండకు వచ్చిన డీకే అరుణకు స్థానిక నాయకులు స్వాగతం పలికారు. కేవలం చట్టాల్లో మార్పు తీసుకురావడం వల్ల అవినీతి పోదని.. అసలైన మార్పు తెరాస నేతల్లో రావాలని అన్నారు.
ఇవీ చూడండి: న్యాయవ్యవస్థను బలహీన పరిచే కుట్ర: సీజేఐ