నల్గొండ జిల్లా మిర్యాలగూడలో 4వేల మంది ముస్లిం సోదరులకు రంజాన్ తోఫా పంపిణీ చేసే కార్యక్రమాన్ని మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రారంభించారు. లాక్ డౌన్ సందర్భంగా.. ప్రభుత్వం ప్రతి సంవత్సరం ముస్లింలకు ఇచ్చే ఇఫ్తార్ విందును రద్దు చేయడం వల్ల.. ఎమ్మెల్యే భాస్కరరావు, మున్సిపల్ ఛైర్మన్ తిరునగరు భార్గవ్ ల సహకారంతో ముస్లింలకు రంజాన్ తోఫా అందించినట్లు తెలిపారు.
మిర్యాలగూడ పట్టణంలో వార్డుల వారీగా ఇంటింటికి రంజాన్ తోఫా పంపిణీ చేయనున్నట్లు మున్సిపల్ ఛైర్మన్ వెల్లడించారు. లాక్ డౌన్ వల్ల ఏ ఒక్క ముస్లిం సోదరుడు బాధ పడకుండా, రంజాన్ పండుగను ఘనంగా చేసుకోవడానికి నిత్యావసరాలను అందిస్తున్న మున్సిపల్ ఛైర్మన్ ను గుత్తా సుఖేందర్ రెడ్డి అభినందించారు.
ఇదీ చూడండి: దూరంగా బెంచీలు... సగంమందే విద్యార్థులు