ETV Bharat / state

మిర్యాలగూడ మార్కెట్​లో డిస్ ఇన్​ఫెక్షన్ టన్నెల్​

author img

By

Published : Apr 9, 2020, 11:26 AM IST

నల్గొండ జిల్లా మిర్యాలగూడలో డిస్ ఇన్​ఫెక్షన్ టన్నెల్​ను ఎమ్మెల్యే భాస్కర్ రావు ప్రారంభించారు. స్థానిక కూరగాయల మార్కెట్​లో ఈ యంత్రాన్ని ఏర్పాటు చేశారు. ప్రజలంతా ఈ టన్నెల్ గుండానే రాకపోకలు సాగించాలని ఎమ్మెల్యే సూచించారు.

టన్నెల్ గుండానే రాకపోకలు సాగించాలి : ఎమ్మెల్యే

నల్గొండ జిల్లా మిర్యాలగూడ కూరగాయల మార్కెట్​లో కరోనా నిర్మూలన కోసం డిస్ ఇన్​ఫెక్షన్ టన్నెల్​ను ఎమ్మెల్యే భాస్కర్ రావు ప్రారంభించారు. కూరగాయల మార్కెట్​లో రద్దీ ఎక్కువగా ఉండటం వల్ల వ్యాధి ప్రబలకుండా ఉండేందుకు హైపో క్లోరైడ్ ద్రావణాన్ని చల్లే టన్నెల్​ను ఏర్పాటు చేశారు.

దుస్తులపైన, శరీరంపైన ఉన్న క్రిములు చనిపోయి కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు ఈ టన్నెల్ దోహద పడుతుందని పేర్కొన్నారు. ప్రతీ ఒక్కరూ ఈ టన్నెల్ గుండానే రాకపోకలు సాగించాలని ఎమ్మెల్యే భాస్కర్ రావు కోరారు. కరోనా వైరస్ వ్యాప్తించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు సూచించారు.

ఇవీ చూడండి : రాష్ట్రంలో 453కు పెరిగిన కరోనా పాజిటివ్ కేసులు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.