మునుగోడులో గెలుపే లక్ష్యంగా పోటీపోటీగా విస్తృత ప్రచారం సాగిస్తున్న రాజకీయ పార్టీలు.. అదే స్థాయిలో మద్యం, డబ్బు పంపిణీ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే నియోజకవర్గంలోకి ప్రవేశించే అన్ని వాహనాలను పోలీసు, రెవెన్యూ అధికారులతో కూడిన బృందాలు విస్తృతంగా తనిఖీ చేస్తున్నాయి. సోదాల్లో భారీగా డబ్బులు పట్టుబడుతున్నాయి. ఉప ఎన్నికల తేదీ దగ్గర పడే కొద్దీ డబ్బు పంపిణీ, రవాణా మరింత పెరిగే అవకాశం ఉండటంతో ఎన్నికల అధికారులు.. దీనికి కళ్లెం వేసేందుకు ప్రత్యేక బలగాలను రంగంలోకి దించారు.
పంతంగి టోల్‌ప్లాజాను కేంద్ర బలగాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. జాతీయ రహదారిపై వెళ్లే వాహనాలను ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు.. ప్రధానంగా డబ్బు, మద్యం తరలింపుపై నిఘా ఉంచారు. ఈ క్రమంలోనే టోల్‌ప్లాజా వద్ద మంత్రి మల్లారెడ్డి వాహనాన్ని పోలీస్ బలగాలు తనిఖీ చేశారు. నాంపల్లి మండల కేంద్రంలో కేంద్ర, రాష్ట్ర బలగాలు కవాతు నిర్వహించారు.
ఇవీ చదవండి: