వేములపల్లి మండల కేంద్రంలో సాగర్ ఎడమ కాలువ వంతెనపై నుంచి డీసీఎం అదుపుతప్పి కాలువలో పడిపోయింది. అతివేగంగా వెళుతున్న కారును తప్పించబోయి డ్రైవర్ ఒక్కసారిగా బ్రేక్ వేయడంతో ఈ ప్రమాదం జరిగింది. దాచేపల్లి మండలం నడికుడి నుంచి నల్గొండ వెళ్లే మార్గ మధ్యలో ఈ ఘటన చోటుచేసుకుంది.
మిర్చి బస్తాలు పట్టుకొని ప్రవాహంలో డ్రైవర్ కొట్టుకుపోతుండగా అతన్ని స్థానికులు కాపాడారు. కొన్ని బస్తాలు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాయి. ఘటనా స్థలానికి చేరుకున్న వేములపల్లి పోలీసులు వాహనాన్ని బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నారు.