ETV Bharat / state

నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ నాయకుల ముందస్తు అరెస్టులు

author img

By

Published : Jun 11, 2020, 12:50 PM IST

అధిక విద్యుత్ బిల్లులకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఛలో సచివాలయం కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు. పలువురు నేతలను గృహనిర్బంధం చేశారు. ధర్నాకు వెళ్లకుండా ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు.

dcc-president-shankar-nayak-arrest-at-miryalaguda-in-nalgonda-district
ఛలో హైదరాబాద్​లో కాంగ్రెస్ నాయకులు... ముందస్తు అరెస్టులు

ఛలో హైదరాబాద్ పిలుపు నేపథ్యంలో... నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శంకర్ నాయక్​ను, కాంగ్రెస్ పార్టీ నాయకులను మిర్యాలగూడలో పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా డీసీసీ ప్రెసిడెంట్ శంకర్ నాయక్ మాట్లాడుతూ... కేసీఆర్​ పాలనలో ధర్నాలు, రాస్తారోకోలు లేకుండా చేస్తూ... తుగ్లక్ పాలనను కొనసాగస్తున్నారని వ్యాఖ్యానించారు.

తెలంగాణ ఉద్యమ సమయంలో కాంగ్రెస్ పార్టీ ధర్నాలు, రాస్తారోకోలకు అనుమతి ఇవ్వకుంటే రాష్ట్రం వచ్చేదా అంటూ ప్రశ్నించారు. అప్పటి ఉద్యమానికి కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చిందని... కానీ కేసీఆర్​ అది మరచిపోయి వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.

ఇవీ చూడండి: సరిహద్దు వెంట పాక్​ దుశ్చర్య.. భారత జవాను మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.