ETV Bharat / sports

బంగ్లాతో టెస్ట్ రద్దైతే భారత్​కు ఇబ్బందా? WTC ఫైనల్​ ఛాన్స్​పై ఎఫెక్ట్ ఉంటుందా? - 2025 WTC Final India

author img

By ETV Bharat Sports Team

Published : 3 hours ago

Updated : 2 hours ago

2025 WTC Final India Chances : భారత్ - బంగ్లాదేశ్‌ కాన్పూర్‌ టెస్టులో రెండో రోజు ఆట పూర్తిగా రద్దైంది. ఒకవేళ ఈ టెస్టు డ్రాగా ముగిసినట్లయితే భారత్‌ డబ్ల్యూటీసీ ఫైనల్‌ అవకాశాలు సంక్లిష్టం కానున్నాయి.

WTC final scenarios
WTC final scenarios (Source : Associated Press)

2025 WTC Final India Chances : భారత్ - బంగ్లాదేశ్‌ మధ్య కాన్పూర్‌ వేదికగా జరుగుతున్న రెండో టెస్టుకు వర్షం తీవ్ర అంతరాయం కలిగిస్తుంది. తొలి రోజు దాదాపు 55 ఓవర్ల ఆట రద్దవగా, రెండో రోజు ఒక్క ఒక్క బంతి పడకుండానే ఆట తుడిచిపెట్టుకుపోయింది. ప్రస్తుతం బంగ్లాదేశ్ 107-3 స్కోర్​తో ఉంది. ఇక టెస్టులో మిగిలింది మూడు రోజులే. ఒకవేళ ఈ మ్యాచ్​ డ్రాగా ముగిసినట్లయితే ఈ సిరీస్​ను టీమ్ఇండియా 1-0తో కైవసం చేసుకుంటుంది. కానీ, ఈ మ్యాచ్ రద్దైనా, డ్రాగా ముగిసినా భారత్​కు 2025 వరల్డ్ టెస్టు ఛాంపియన్​షిప్​ ఫైనల్ అవకాశాలు కాస్త సంక్లిష్టంగా మారనున్నాయి. మరి టీమ్ఇండియాకు డబ్ల్యూటీసీ ఫైనల్ ఛాన్స్​లు ఎలా ఉన్నాయి? తర్వాత భారత్ ఎన్ని మ్యాచ్​లు నెగ్గాలి? ఇప్పుడు చూద్దాం.

2023- 25 డబ్ల్యూటీసీ సైకిల్​లో భారత్ ఇప్పటివరకు 10 మ్యాచ్​ల్లో ఏడింట్లో నెగ్గి, 2 టెస్టుల్లో ఓడింది. మరోకటి డ్రా చేసుకుంది. దీంతో పాయింట్ల పట్టికలో ప్రస్తుతం భారత్ 71.67 శాతం (86 పాయింట్లు) తో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇక ఆస్ట్రేలియా 12మ్యాచ్​ల్లో 8 విజయాలు నమోదు చేసి 62.50 శాతం (90 పాయింట్లు)తో రెండో స్థానంలో ఉంది.

ప్రస్తుత బంగ్లా సిరీస్​ తర్వాత 2025 డబ్ల్యూటీసీలో భారత్ ఇంకా 8 మ్యాచ్​లు ఆడాల్సి ఉంది. అందులో 3 మ్యాచ్​లు న్యూజిలాండ్​తో, 5 మ్యాచ్​ల్లో ఆస్ట్రేలియాతో తలపడనుంది. అయితే బంగ్లా సిరీస్​ను భారత్ 2-0తో కైవసం చేసుకున్నట్లైతే, మిగిలిన 8 టెస్టు​ల్లో భారత్ కనీసం 3 మ్యాచ్​లు నెగ్గినా ఫైనల్​కు అర్హత సాధిస్తుంది.

అదే భారత్ - బంగ్లా టెస్టు డ్రా గా ముగిస్తే, 1-0తో సిరీస్ నెగ్గుతుంది. కానీ, డబ్ల్యూటీసీ ఫైనల్​కు చేరాలంటే టీమ్ఇండియా తన తర్వాతి 8 టెస్టుల్లో 5 మ్యాచ్​లు నెగ్గాల్సి ఉంటుంది. స్వదేశంలో కివీస్​తో 3, ఆస్ట్రేలియాపై కనీసం 2 మ్యాచ్​ల్లో విజయం సాధించాలి. అలాగే ప్రస్తుతం మూడు, నాలుగు స్థానాల్లో ఉన్న శ్రీలంక (50 పాయింట్ల శాతం), న్యూజిలాండ్ (42.86 శాతం) తమ తదుపరి మ్యాచ్​ల ఫలితాలపై కూడా భారత్ ఫైనల్ అవకాశాలు ఆధారపడి ఉంటాయి.

WTC టేబుల్​లో టాప్​లోనే టీమ్ఇండియా - ఎవరికీ అందనంత ఎత్తులో! - WTC 2025

డబ్ల్యూటీసీ ఫైనల్‌లో టీమ్‌ఇండియా అడుగుపెట్టాలంటే? - రాబోయే 10 టెస్టుల్లో ఎన్ని గెలవాలంటే? - Teamindia WTC Final 2025

Last Updated : 2 hours ago
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.