ETV Bharat / state

'కేసీఆర్​ను దూషిస్తే మీకే పాపం తగులుతుంది' - Nalgonda District latest News

అభివృద్ధే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్... రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతున్నారని మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. కృష్ణా పరివాహక ప్రాంతాల్లో రూ.3వేల కోట్లతో 13 లిప్ట్ ఇరిగేషన్​లను మంజూరు చేసిన ఘనత సీఏం​దేనని తెలిపారు. రైతు సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్న కేసీఆర్​ని దూషిస్తే మీకే పాపం తగులుతుందని ప్రతి పక్షాలను ఉద్దేశించి అన్నారు.

Council Chairman Gutta Sukhender Reddy said that Chief Minister KCR was taking the state forward with the aim of development.
కేసీఆర్​ను దూషిస్తే మీకే పాపం తగులుతుంది
author img

By

Published : Feb 8, 2021, 12:45 PM IST

అభివృద్ధే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్... రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతున్నారని మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. కృష్ణా పరివాహక ప్రాంతాల్లో రూ.3వేల కోట్లతో 13 లిప్ట్ ఇరిగేషన్​లను మంజూరు చేసిన ఘనత సీఏం​దేనని నల్గొండలోని తన కార్యాలయంలో తెలిపారు. రైతు సంక్షేమం కోసం నిరంతరం కేసీఆర్​ కృషి చేయడం వల్లే అధిక పంటల పండించడంలో పంజాబ్ తర్వాత తెలంగాణ రాష్ట్రం రెండో స్థానంలో నిలిచిందని పేర్కొన్నారు.

డిండి ఎత్తిపోతల పథకం, బ్రాహ్మణ వెల్లంల, శ్రీశైలం సొరంగ మార్గం ప్రాజెక్టుల కోసం ఈ సంవత్సరం బడ్జెట్​లో నిధులు కేటాయిస్తున్నట్లు కేసీఆర్ హామీ ఇచ్చారని గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. వచ్చే ఏడాదిలోపు పనులు పూర్తి అవుతాయని తెలిపారు.

అభివృద్ధే లక్ష్యంగా ముందుకు పోతున్న ముఖ్యమంత్రిని... ప్రతి పక్షాలు నోటికి ఎదివస్తే అది మాట్లాడటం సరికాదని అన్నారు. కేసీఆర్​ను ఎంత దూషిస్తే మీకు అంత పాపం తగులుతుందని పేర్కొన్నారు. సూర్యాపేట జిల్లా మట్టంపల్లిలో భాజపా నాయకులు పోలీసులపై జరిపిన దాడిని ఖండిస్తూ... తప్పు చేసినవారిని చట్టం శిక్షిస్తుందన్నారు. ఎల్లుండి 10న జరిగే బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరారు.

ఇదీ చదవండి: చెన్నైకి శశికళ- భారీగా స్వాగత ఏర్పాట్లు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.