ETV Bharat / state

ఉమ్మడి నల్గొండ జిల్లాలో పెరుగుతున్న కరోనా కేసులు

ఉమ్మడి నల్గొండ జిల్లాలో కరోనా విజృంభిస్తున్నది. శుక్రవారం నాడు ఏకంగా 28 పాజిటివ్​ కేసులు నమోదు కాగా.. అందులో నల్గొండ జిల్లాలో 25, యాదాద్రి భువనగిరి జిల్లాలో 2, సూర్యాపేటలో ఒక కేసు ఉన్నాయి. వైరస్​ బారిన పడ్డ వారిలో ఎక్కువ మంది పోలీసు సిబ్బంది ఉన్నారు.

Corona Positive Cases Increased in Nalgonda District
ఉమ్మడి నల్గొండ జిల్లాలో పెరుగుతున్న కరోనా కేసులు
author img

By

Published : Jun 28, 2020, 11:55 AM IST

ఉమ్మడి నల్గొండ జిల్లాలో రికార్డు స్థాయిలో కొవిడ్ పాజిటివ్​ కేసులు నిర్ధారణ అయ్యాయి. ఒక్కరోజే 25 కేసులు నమోదు కావడం, జిల్లా కేంద్రంలోనే 21 కేసులుండటం వైరస్ వ్యాప్తి తీవ్రతను తెలియజేస్తోంది. ఇంకా 134 మంది ఫలితాలు రావాల్సి ఉంది. కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని... వైద్యారోగ్యశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. మిర్యాలగూడ, నకిరేకల్ మండలాల్లో కూడా రెండేసి చొప్పున పాజిటివ్​లు తేలాయి. శుక్రవారం ప్రకటించిన పాజిటివ్​ కేసుల్లో ఎక్కువ మంది పోలీసుశాఖలో పనిచేసే వారే ఉన్నారు. జిల్లాలో ఇప్పటివరకు 35 కేసులు ఉండగా.. తాజా కేసులతో ఆ సంఖ్య 60కి చేరింది. పోలీసు ఉన్నతాధికారి కార్యాలయంలో పనిచేసే కానిస్టేబుల్​తో పాటు.. నల్గొండ పట్టణంలోని ఠాణాలో పనిచేసే ఐదుగురు కానిస్టేబుళ్లు సైతం కరోనా బారిన పడ్డారు. అటు పన్నెండో బెటాలియన్​లోనూ ఇద్దరికి వైరస్ సోకింది. ఉమ్మడి జిల్లాలోని ముగ్గురు ప్రజాప్రతినిధుల గన్​మెన్లకు కరోనా పాజిటివ్​ అని అనుమానిస్తున్నారు. సదరు ప్రజాప్రతినిధులు సైతం... పరీక్షలు చేయించుకోవడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇన్నాళ్లూ జిల్లా, మండల కేంద్రాలకే పరిమితమైన కరోనా.. ఇప్పుడు పల్లెలకూ పాకడం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో ఆందోళన కనిపిస్తోంది.

తాజాగా యాదాద్రి భువనగిరి జిల్లాలో రెండు, సూర్యాపేట జిల్లాలో ఒక కేసు బయటపడ్డాయి. సూర్యాపేట జిల్లాలో వైరస్​ బారిన పడి... 80 ఏళ్ల వృద్ధురాలు కన్నుమూసింది. శ్వాస సమస్యతో ఇబ్బంది పడుతూ హైదరాబాద్​కు వెళ్లిన సదరు వృద్ధురాలికి... అక్కడ నిర్వహించిన పరీక్షల్లో పాజిటివ్ రావడం వల్ల గాంధీ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆమె ప్రాణాలు కోల్పోయారు. ఉమ్మడి జిల్లాలో రోజురోజుకూ కేసులు పెరగడం వల్ల బాధితులను హైదరాబాద్ గాంధీకి తరలిస్తున్నారు. నల్గొండ పట్టణంలో రికార్డు స్థాయిలో కేసులు నమోదు అవుతుండడం వల్ల వ్యాపారులు తమ కార్యకలాపాలు తగ్గించుకోవాలని, ప్రజలు బయట తిరగకూడదని అధికారులు సూచిస్తున్నారు. అటు వ్యాపారులు సైతం.. స్వచ్ఛంధంగా వ్యాపార కార్యకలాపాలు తగ్గించుకోవాలని ఆలోచిస్తున్నారు. చింతపల్లి మండల కేంద్రంలోని మద్యం దుకాణంలో పనిచేసే వ్యక్తికి వైరస్ సోకడం వల్ల... ఆ దుకాణంలో మద్యం కొన్న వారికోసం గత రెండ్రోజులుగా జల్లెడ పడుతున్నారు.

ఉమ్మడి నల్గొండ జిల్లాలో 60 కేసులకు గాను ఇప్పటివరకు ఒకరు మృతి చెందగా... 42 మంది అస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మరో పదిమందికి నిర్ధారణ అయినా, ఆ కేసులను వలస కూలీల జాబితాలో చేర్చారు. ఇప్పటివరకు 1055 మంది నమూనాలు సేకరించి పంపారు. సూర్యాపేట జిల్లాలో 87 కేసులు నమోదవగా.. అందులో ఇద్దరు మృత్యువాత పడ్డారు. ఇప్పటివరకు 753 మంది నమూనాలు సేకరిస్తే.. అందులో రెండింటి ఫలితాలు రావాల్సి ఉంది. యాదాద్రి భువనగిరి జిల్లాలో తాజాగా బయటపడ్డ రెండు కేసులతో కలిపి.. 23 పాజిటివ్​ కేసులు నమోదయ్యాయి. మొత్తంగా 304 మంది నమూనాలకు గాను... ఇంకా 16 మంది ఫలితాలు వెల్లడి కావాల్సి ఉంది. ఉమ్మడి జిల్లాపరంగా చూస్తే గత మార్చి 21న సూర్యాపేట జిల్లాలో ఒకే రోజు 26 కేసులు నమోదు కాగా... శుక్రవారం నల్గొండ జిల్లాలో మరో 25 కేసులు నిర్ధారణ అయ్యాయి.

ఇవీచూడండి: నాలుగేళ్ల చిన్నారిపై వృద్ధుడు అత్యాచారయత్నం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.