ETV Bharat / state

ఉమ్మడి నల్గొండ జిల్లాలో కరోనా పరేషాన్​... అలర్ట్​ అయిన అధికారులు - corona cases latest

భారత వైద్య పరిశోధన మండలి ఐసీఎంఆర్​ ప్రతినిధుల బృందం సభ్యులు... నల్గొండ జిల్లాలో రెండోరోజు నమునాలు సేకరించారు. అటు యాదాద్రి జిల్లాకు వచ్చిన వారితో వైరస్ బయటపడ్డ పల్లెల్లో.. అనుమానితుల్ని క్వారంటైన్లకు తరలిస్తున్నారు. సూర్యాపేటలోని కంటైన్మెంట్​ జోన్లలో ఉదయం నుంచి సాయంత్రం వరకు రాకపోకలకు అనుమతిస్తున్నారు.

corona-cases-in-nalgonda-district
ఉమ్మడి నల్గొండ జిల్లాలో కరోనా పరేషాన్​... అలర్ట్​ అయిన అధికారులు
author img

By

Published : May 16, 2020, 7:15 PM IST

నల్గొండ జిల్లాలోని ఐదు మండలాల్లో ఐసీఎంఆర్​ ప్రతినిధుల బృందాలు రెండోరోజు నమూనాలు సేకరించాయి. ఒక్కో మండలంలోని ఒక్కో గ్రామంలో 40 మంది చొప్పున రోజుకు రెండు వందల మందిని పరిశీలించాయి. శుక్రవారం జిల్లాకు వచ్చిన 30 మంది సభ్యులు గల భారత వైద్య పరిశోధన మండలికి చెందిన ఐదు బృందాలు... నిన్న ఐదు మండలాల్లో పర్యటించాయి. వైద్యులు ఇవాళ గుండ్లపల్లి, నాంపల్లి, పెద్దవూర, అనుముల, కనగల్ మండలాల్లోని గ్రామాల్లో... స్థానికుల రక్త నమూనాలు తీసుకున్నారు. గ్రామాన్ని యూనిట్​గా తీసుకున్న వైద్యులు.. పల్లెలోని నాలుగు దిక్కుల లెక్కన కొద్ది మందిని ఎంపిక చేసుకున్నారు. వారికి మండల వైద్యాధికారులు, గ్రామ సిబ్బంది సహకరించారు.

అటు యాదాద్రిలో...

అటు యాదాద్రి భువనగిరి జిల్లాలో... వలస వెళ్లి తిరిగివచ్చిన కూలీలతో గ్రామాలన్నీ భయంగా కాలం గడుపుతున్నాయి. ఇప్పటికే వివిధ మండలాల్లో 20 మందికి పైగా.. పాజిటివ్ బయటపడింది. దీనితో సదరు గ్రామాల్లో భారీ భద్రత నడుమ... పర్యవేక్షణ కొనసాగుతోంది. ఆత్మకూరు(ఎం), చౌటుప్పల్, సంస్థాన్ నారాయణపురం, మోటకొండూరులో... ఇంటింటి సర్వే జరుగుతోంది. ఆలేరు మండలంలోని ఒక గ్రామంలో అనుమానితులున్నారన్న కోణంలో... ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు.

వలస కూలీల తాకిడితో...

జిల్లా అధికారులకు అందిన సమాచారం మేరకు... ఇద్దరు వ్యక్తులకు సంబంధించిన ప్రైమరీ, సెకండరీ కాంటాక్టులపై దృష్టిసారించారు. ఇక యాదాద్రి జిల్లాకు... వలస కూలీల తాకిడి కొనసాగుతోంది. మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక నుంచి స్వగ్రామాలకు... పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. అనుమానితులుగా భావిస్తున్న వారిని... అప్పటికప్పుడే క్వారంటైన్​కు పంపుతున్నారు. మిగతా వారిని హోం క్వారంటైన్ చేస్తున్నారు.

ఇవీ చూడండి: బీర్లను నేలపాలు చేసిన ఎక్సైజ్ పోలీసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.