ETV Bharat / state

రైతుల దీక్షకు మద్దతుగా ట్రాక్టర్లతో కాంగ్రెస్ ర్యాలీ - నల్గొండలో కాంగ్రెస్​ ఆధ్వర్యంలో ట్రాక్టర్ల ర్యాలీ

దిల్లీలో రైతుల దీక్షకు మద్దతుగా నల్గొండ జిల్లా హాలియా పురపాలక సంఘం పరిధిలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ట్రాక్టర్లతో ర్యాలీ చేశారు. సుమారు 300ల ట్రాక్టర్లతో అనుముల ప్రభుత్వ ఐటీఐ కళాశాల.. మిర్యాలగూడ రోడ్డు నుంచి సాగర్ రోడ్డు వరకు ర్యాలీ కొనసాగింది.

రైతుల దీక్షకు మద్దతుగా నల్గొండలో కాంగ్రెస్​ ట్రాక్టర్ల ర్యాలీ
రైతుల దీక్షకు మద్దతుగా నల్గొండలో ట్రాక్టర్లతో కాంగ్రెస్ ఆధ్వర్యంలో ర్యాలీ
author img

By

Published : Jan 31, 2021, 4:06 PM IST

వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు చేస్తున్న దీక్షలకు మద్దతుగా నల్గొండలో కాంగ్రెస్​ పార్టీ ఆధ్వర్యంలో ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించారు. హాలియా ప్రధాన కూడలి వద్ద మాజీ మంత్రి జానారెడ్డి పార్టీ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు.

భాజపా సర్కారు తీసుకొచ్చిన నూతన సాగు చట్టాల వల్ల రైతులకు ఎలాంటి ప్రయోజనం లేదని విమర్శించారు. వ్యవసాయ చట్టాలను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్​ చేశారు. గణతంత్రదినోత్సవం రోజున రైతుల ముసుగులో కొన్ని అసాంఘికశక్తులు చొరబడి విధ్వంసం చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు. పంటలకు మద్దతు ధరపై చట్టబద్దత తేవాలని డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా అందరూ రైతులకు మద్దతుగా నిలవాలని కోరారు.

ఇదీ చూడండి: భవిష్యత్తులో పిల్లలకు ఎలాంటి జబ్బులు రావు : ఇంద్రకరణ్ రెడ్డి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.