ETV Bharat / state

Congress MP's: ప్రొటోకాల్​పై కాంగ్రెస్​ ఎంపీల ఆగ్రహం.. సమావేశం రసాభాస

నల్గొండ జిల్లా జడ్పీ సర్వసభ్య సమావేశం గరంగరంగా సాగింది. ప్రొటోకాల్ సరిగా పాటించట్లేదని అధికారులపై తీరుపై కాంగ్రెస్‌ ఎంపీలు మండిపడ్డారు. ఎంపీల తీరుపై ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల సాగర్‌ ఆయకట్టు ఎడారవుతుందన్న ఉత్తమ్‌.. కృష్ణా, గోదావరి యాజమాన్య బోర్డులపై సుప్రీంకు వెళ్లాలని సూచించారు.

Congress MP's
నల్గొండ జిల్లా జడ్పీ సర్వసభ్య సమావేశం
author img

By

Published : Jul 25, 2021, 4:46 AM IST

అధికారుల తీరుపై కాంగ్రెస్ ఎంపీలు మండిపడ్డారు. ప్రొటోకాల్ సరిగా పాటించట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో పార్లమెంటు సభ్యుల తీరుపై అధికార పార్టీ శాసనసభ్యుడు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఫలితంగా నల్గొండ జడ్పీ సర్వసభ్య సమావేశం గరంగరంగా సాగింది. కృష్ణా, గోదావరి యాజమాన్య బోర్డుల నిర్వహణపై సుప్రీంకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకోవాలని ఎంపీలు కేసీఆర్ సర్కారుకు సూచించారు.

పార్లమెంటు సభ్యులమన్న కనీస గౌరవం లేకుండా చిన్నచూపు చూస్తున్నారంటూ.. కాంగ్రెస్ సీనియర్ నేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నల్గొండ జిల్లా ఉన్నతాధికారులపై అసహనం వ్యక్తం చేశారు. జిల్లా పరిషత్‌ సర్వసభ్య సమావేశంలో అధికారుల తీరును వీరు ఎండగట్టారు. కేంద్రం అమలు చేస్తున్న కార్యక్రమాల్లోనూ ప్రొటోకాల్ పాటించట్లేదని నిలదీయడంతో.. అధికార పార్టీకి చెందిన స్థానిక శాసనసభ్యుడు కంచర్ల భూపాల్ రెడ్డి తీవ్రస్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేశారు. చిన్నపిల్లల్లా వ్యవహరిస్తూ సభ జరగకుండా చూస్తున్నారని ఎమ్మెల్యే వ్యాఖ్యానించడంతో.. ఉత్తమ్ మందలించారు. చివరకు ఛైర్మన్ వారించడంతో.. భూపాల్ రెడ్డితోపాటు వెంకట్ రెడ్డి శాంతించారు.

అనంతరం కోమటిరెడ్డితో కలిసి తన నివాసంలో సమావేశం నిర్వహించిన ఉత్తమ్.. అధికార పార్టీ తీరుపై మండిపడ్డారు. కృష్ణా, గోదావరి నదుల యాజమాన్య బోర్డుల నిర్వహణ నోటిఫికేషన్ ద్వారా రాష్ట్రానికి అన్యాయం జరుగుతోందని వివరించారు. కేసీఆర్, తెరాస వైఫల్యాలే ఇందుకు ప్రధాన కారణమని విమర్శలు గుప్పించారు.

రాష్ట్రానికి అన్యాయం జరిగేలా ఉన్న యాజమాన్య బోర్డుల నోటిఫికేషన్‌పై సర్వోన్నత న్యాయస్థానానికి వెళ్లి స్టే తెచ్చుకోవాలని నేతలు రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. దీనిపైనే జడ్పీ సర్వసభ్య సమావేశం తీర్మానం చేసి పంపాలని ఎంపీలు సూచించారు. దళితుణ్ని సీఎం చేస్తానని కేసీఆర్‌ మోసం చేశారని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆరోపించారు.

జడ్పీ సమావేశంలో పలు సమస్యలపై చర్చించిన అనంతరం ప్రొటోకాల్‌ విషయంలో ఎంపీ, ఎమ్మెల్యే మధ్య స్వల్ప వాగ్వాదం చోటుచేసుకుంది. సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని దానిపై చర్చించేందుకు జిల్లా కలెక్టర్‌ అందుబాటులో లేరని కోమటిరెడ్డి అసహనం వ్యక్తం చేశారు. ప్రొటోకాల్​పై కలెక్టర్‌కు, జిల్లా మంత్రికి విన్నవించామని వారు సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారని ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు.

ఇవీ చూడండి:

నల్గొండ జడ్పీ సమావేశం.. ప్రొటోకాల్​పై ఎంపీ కోమటిరెడ్డి అసహనం

Uttam: 'ప్రభుత్వ అసమర్థతతోనే రాష్ట్రానికి వ్యతిరేకంగా నోటిఫికేషన్‌'

TRS VS CONGRESS: రైతువేదికలో బాహాబాహీకి దిగిన తెరాస, కాంగ్రెస్‌ వర్గీయులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.