ETV Bharat / state

సాగర్​లో జానారెడ్డి చేసిన అభివృద్ధే కనబడుతోంది: రేవంత్​ - nagarjuna sagar constituency campaign news

నాగార్జున సాగర్​ ఉపఎన్నికల ప్రచారంలో రాజకీయ పార్టీలు వేగం పెంచాయి. అభ్యర్థుల తరఫున హేమాహేమీలు రంగంలోకి దిగాయి. కాంగ్రెస్​ పార్టీ అభ్యర్థి జానారెడ్డి తరఫున మల్కాజ్​గిరి ఎంపీ రేవంత్​ రెడ్డి.. తిరుమలగిరి మండలంలోని పలు గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు.

revanth reddy campaign in sagar
సాగర్​లో రేవంత్​ రెడ్డి ప్రచారం
author img

By

Published : Apr 12, 2021, 1:48 PM IST

నాగార్జున సాగర్​ నియోజకవర్గంలో జానారెడ్డి చేసిన అభివృద్ధి తప్ప మరేదీ కనబడటం లేదని మల్కాజ్​గిరి ఎంపీ రేవంత్​ రెడ్డి అన్నారు. సాగర్​ ఉపఎన్నికల ప్రచారంలో ఆ పార్టీ అభ్యర్థి జానారెడ్డి తరఫున రేవంత్​ ప్రచారం నిర్వహించారు. నల్గొండ జిల్లా తిరుమల గిరి మండలంలోని ఎర్రచెరువు, గొడుమడక, నాయకుని తండా, తిమ్మాయి పాలెం, చింతల పాలెంలో రేవంత్​ పర్యటించారు. ప్రచారానికి వచ్చిన తనకు ఘనస్వాగతం పలికినందుకు అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు. జానారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు.

సాగర్​లో జానారెడ్డి చేసిన అభివృద్ధే కనబడుతోంది: రేవంత్​

వారంతా నాన్​ లోకల్​..

ఈ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న తెరాస అభ్యర్థి నకిరేకల్​ నుంచి వ్యక్తి అని రేవంత్​ విమర్శించారు. ఎన్నికలు అయిపోతే వారి దారిన వారు వెళ్లిపోతారని ఎద్దేవా చేశారు. కానీ జానారెడ్డి మాత్రం ఇక్కడే ఉంటారని హామీ ఇచ్చారు. సీఎం కేసీఆర్​కు సానుభూతి ఉంటే తెలంగాణ నీళ్ల కోసం పోరాడిన జనార్దన్ రెడ్డి కుమార్తెను ఎందుకు ఏకగ్రీవం చేయలేదో చెప్పాలని డిమాండ్​ చేశారు.

ఆలోచన మాదే..

తెరాసను గెలిపిస్తే నెల్లికల్ లిఫ్ట్​ పనులను కుర్చీ వేసుకొని చేయిస్తా అన్న సీఎం కేసీఆర్​కు.. ఆ మాట ఇప్పుడు గుర్తొచ్చిందని ఎద్దేవా చేశారు. నెల్లికల్ లిఫ్ట్ కట్టాలనే ఆలోచన చేసింది జానారెడ్డి అని గుర్తు చేశారు.

ఇదీ చదవండి: జానారెడ్డి గెలిస్తే ప్రజలకు ఒరిగేదేమీలేదు: మంత్రులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.