తెలంగాణలో పోలీసులు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల బాధ్యుడు మాణిక్క ఠాగూర్, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఆరోపించారు. నాగార్జున సాగర్ ఉప ఎన్నిక ప్రచారానికి ఒక్కరోజే ఉన్నందున అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నాగార్జున సాగర్‌లోని జానారెడ్డి నివాసంలో బుధవారం సాయంత్రం ఆ పార్టీ పెద్దలంతా సమావేశమయ్యారు.
కాంగ్రెస్ నాయకులపై దాడి చేసిన వారిపై ఇప్పటికే కలెక్టర్, ఎస్పీ, రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశామని తెలిపారు. కేసీఆర్ సభ సందర్భంగా పలువురి కాంగ్రెస్ నేతలను అరెస్టు చేశారని ఆరోపించారు. సమావేశంలో పొన్నం ప్రభాకర్, జానారెడ్డి తదితరులు ఉన్నారు.
ఇదీ చూడండి: సాగర్‌లో అభ్యర్థుల బలాలు, బలహీనతలు చూద్దామా