ETV Bharat / state

సాగర్​ ఉపఎన్నికలో కాంగ్రెస్​ చరిత్ర సృష్టిస్తుంది: జానారెడ్డి

నాగార్జున సాగర్​ ఉపఎన్నికల్లో కాంగ్రెస్​ పార్టీ చరిత్ర సృష్టించబోతోందని ఆ పార్టీ అభ్యర్థి, సీనియర్ నాయకుడు జానారెడ్డి అన్నారు. తెరాస అసత్య ప్రచారాలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. నియోజకవర్గంలో ఎవరు ఎక్కువ అభివృద్ధి చేశారో దృష్టిలో ఉంచుకొని ఓటేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. హాలియాలో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు.

jaana reddy
జానారెడ్డి
author img

By

Published : Apr 15, 2021, 3:34 PM IST

Updated : Apr 15, 2021, 3:56 PM IST

సాగర్​ ఉపఎన్నికలో కాంగ్రెస్​ చరిత్ర సృష్టిస్తుంది: జానారెడ్డి

నాగార్జున సాగర్​ నియోజకవర్గంలో తాను చేసిన అభివృద్ధిని గుర్తు చేసుకొని ప్రజలు ఓటేయాలని కాంగ్రెస్​ అభ్యర్థి జానారెడ్డి కోరారు. తాను పదవిలో ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి పనులను వివరించారు. సాగర్​ ఉపఎన్నిక సందర్భంగా నల్గొండ జిల్లా హాలియాలో విలేకరుల సమావేశం నిర్వహించారు. 17న జరిగే ఉపఎన్నికల్లో కాంగ్రెస్​ చరిత్ర సృష్టించబోతోందని జానారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. తన హయాంలో చేసిన అభివృద్ధిని ప్రజల సాక్షిగా బహిరంగసభలో గణాంకాలతో సహా వివరించానని తెలిపారు.

తెరాస దిగజారుడు రాజకీయాలు చేస్తోందని జానారెడ్డి దుయ్యబట్టారు. సంతలో పశువులను కొనుగోలు చేసినట్లు ఇతర పార్టీల నాయకులను తెరాస కొనుగోలు చేస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్​ పార్టీ నీటి వసతులను కల్పించబట్టే నేడు 52 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతోందని స్పష్టం చేశారు. తమ పార్టీని చావు నోట్లో పెట్టి తెలంగాణ సాధించుకున్నామని వెల్లడించారు.

ఇదీ చదవండి: జానారెడ్డికి సీఎం అయ్యే అవకాశం ఎప్పుడూ రాలేదు: గుత్తా

Last Updated : Apr 15, 2021, 3:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.