నాగార్జునసాగర్ జలాశయం నిర్మాణ సమయంలో అధికారుల కోసం నిర్మించిన ప్రభుత్వ క్వార్టర్స్ కేటాయింపు ఇప్పడు అధికార, ప్రతిపక్ష నాయకులు మధ్య వివాదానికి తెరలేపింది. నాగార్జునసాగర్ హిల్ కాలనీ, పైలాను కాలనీల్లో దాదాపు 1200 వందల క్వార్టర్స్ నిర్మిoచి అందులో ఏ టైప్, బీ టైప్, సీ టైప్ అని విభజించి అధికారుల హోదాకు తగ్గట్టు కేటాయింపులు జరిపారు. ఇప్పుడు అసలు కేటాయింపు దారులకంటే రాజకీయనాయకుల పైరవీలతో సాగర్లో అక్రమంగా కొనుగోలు చేసి నివాసం ఉంటున్నారు. నాగార్జునసాగర్ పురపాలక సంఘం అయిన తర్వాత అధికార, ప్రతిపక్షపార్టీల నాయకుల మధ్య కొంత కాలంగా ఒకరిపై ఒకరు ఎన్నెస్పీ అధికారులకు ఫిర్యాదులు చేసుకున్నారు.
ఇవాళ పర్యవేక్షక ఇంజినీరు కార్యాలయంలో అధికారులకు తెరాస నాయకులకు క్వార్టర్స్ కేటాయింపులు చేస్తున్నారని కాంగ్రెస్ నాయకులు ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న తెరాస నాయకులు, సాగర్ మున్సిపాలిటీ కౌన్సిలర్లు ఎస్ఈ కార్యాలయానికి చేరుకుని పరస్పరం వాగ్వాదానికి దిగారు. అధికారంలో ఉన్నపుడు మీరు అక్రమ కేటాయింపులు చేయలేదా అని కాంగ్రెస్ నాయకులను ప్రశ్నించారు. ఎన్నెస్పీ అధికారులు మాత్రం ఎవరికి అక్రమంగా క్వార్టర్స్ కేటాయించలేదని స్పష్టం చేశారు.
ఇవీ చూడండి: కరోనా భయాన్ని పోగొట్టేందుకు ప్రభుత్వం కృషి: ఈటల