ETV Bharat / state

సాగర్​ ఉపఎన్నికల్లో ప్రచారం ప్రారంభించిన భాజపా

author img

By

Published : Apr 1, 2021, 3:46 PM IST

నాగార్జునసాగర్ ఉపఎన్నికల్లో భాజపా అభ్యర్థి రవినాయక్ ప్రచారం ప్రారంభించారు. అంతకముందు ఆయన ఆబంగాపురం శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

BJP launches campaign
ప్రచారం ప్రారంభించిన భాజపా

నాగార్జునసాగర్ ఉపఎన్నికల్లో భాజపా ప్రచారం ప్రారంభించింది. పార్టీ అభ్యర్థి రవినాయక్ మాడుగులపల్లి మండలం ఆబంగాపురం శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలో సతిసమేతంగా ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల సమన్వయ కర్తలు సంకినేని వెంకటేశ్వరరావు, మాజీ ఎంపీ సురేశ్​ రెడ్డి, కార్యకర్తలు పాల్గొన్నారు.

నియోజకవర్గానికి ఈశాన్య దిక్కున ఉన్న ఆబంగాపురం నుంచి... సాగర్ ఎన్నికల్లో ఎవరు పోటీ చేసినా ఇక్కడ ఎన్నికల ప్రచారం చేయడం ఆనవాయితీగా వస్తోంది. భాజపా నాయకులు గజలాపురం, పూసలపాడు, కంపాలా పల్లి, ధర్మాపురంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరిగి ఓట్లు అభ్యర్థిస్తున్నారు.

ఇదీ చూడండి: ఈ ఉద్యమంతో కేసీఆర్​కు వణుకు పుట్టాలి: బండి సంజయ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.