నల్గొండ జిల్లా చింతపల్లి మండలం కుర్మేడ్ ఎక్స్‌రోడ్డు వద్ద పోలీసులు కిరాణం దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో గంజి క్రిష్ణయ్య అనే వ్యక్తి నిర్వహిస్తున్న దుకాణంలో సుమారు లక్ష రూపాయలు విలువ చేసే నిషేధిత గుట్కాను పోలీసులు పట్టుకున్నారు.
హైదరాబాద్ నుంచి వస్తోన్న వాహనాలు తనిఖీ చేస్తుండగా ఓ ఆటోలో తరలిస్తోన్న 220 కిలోల నల్లబెల్లాన్ని పోలీసులు గుర్తించారు. నల్లబెల్లాన్ని, ఆటోను స్వాధీనం చేసుకుని స్టేషన్‌కు తరలించారు. ఆటో డ్రైవర్‌తోపాటు కిరాణా దుకాణం యజమానిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
- ఇవీ చూడండి: నకిలీ విత్తన విక్రయాలపై ఉక్కుపాదం.!