నల్గొండ-ఖమ్మం-వరంగల్ నియోజకవర్గ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు తొలిరోజు నల్గొండ జిల్లాలో ఒక్క నామినేషన్ మాత్రమే నమోదైంది. స్వతంత్ర అభ్యర్థిగా బండారు నాగరాజు నామినేషన్ పత్రాన్ని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్‌కు అందజేశారు.
నల్గొండ స్థానానికి రిటర్నింగ్ అధికారిగా జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ వ్యవహరించనున్నారు. ఈ రోజు నుంచి ఈ నెల 23 వరకు నామినేషన్లు స్వీకరించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. ఈనెల 24న నామినేషన్ల పరిశీలన, 26న నామినేషన్ల ఉపసంహరణ గడువున్నట్లు వెల్లడించారు. మార్చి 14న పోలింగ్.. 17న ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నారు.