ETV Bharat / state

నదీజలాలపై కేంద్రం తీరు రాజ్యాంగ విరుద్ధం: అఖిల పక్ష నేతలు

Water Disputes in Telangana: తెలంగాణ నదీ జలాల విషయంలో కేంద్రం తీరు రాజ్యాంగ విరుద్ధంగా ఉందని అఖిల పక్ష నేతలు ఆరోపించారు. కేంద్రం కృష్ణా, గోదావరి నదీ జలాల విషయంలో సమస్యను సృష్టిస్తుందే తప్ప పరిష్కరించడం లేదని మండిపడ్డారు. ఈ మేరకు నల్గొండ లయన్స్​క్లబ్​లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. వక్తలు తమ అభిప్రాయాలను వెలిబుచ్చారు.

water disputes in telangana
తెలంగాణలో నదీజలాల వివాదం
author img

By

Published : Apr 17, 2022, 9:08 AM IST

Water Disputes in Telangana: తెలంగాణ పరిధిలోని నదీ జలాలను కేంద్ర ప్రభుత్వం తమ పరిధిలోకి తీసుకుంటూ జారీ చేసిన గెజిట్‌ను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ నీలగిరి నుంచి మరో సమర శంఖారావం పూరించాలని వక్తలు నిర్ణయించారు. నల్గొండ లయన్స్‌క్లబ్‌లో తెలంగాణ డెవలప్‌మెంట్‌ ఫోరం ఆధ్వర్యంలో శనివారం జరిగిన అఖిలపక్ష పార్టీలు, మేధావుల రౌండ్‌టేబుల్‌ సమావేశంలో నదీ జలాల పరిరక్షణ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని తప్పుపట్టారు. కేంద్రం కృష్ణా, గోదావరి నదీ జలాల విషయంలో సమస్యను సృష్టిస్తుందే తప్ప పరిష్కరించడం లేదని రాజ్యాంగ నిపుణుడు మాడభూషి శ్రీధర్‌ చెప్పారు.

నదీ జలాలను కేంద్రం తన అధీనంలోకి తీసుకోవడం రాజ్యాంగ విరుద్ధమైన చర్య అన్నారు. తెలంగాణ ప్రాజెక్టుల విషయంలో కేంద్రం పెత్తనం తగదని ఆచార్య కోదండరాం అన్నారు. గెజిట్‌ నోటిఫికేషన్‌ అమల్లోకి వస్తే రాష్ట్రాల పరిధిలో ఉన్న ప్రాజెక్టులు కేంద్ర పరిధిలోకి మారిపోతాయన్నారు. కృష్ణా, గోదావరి నదుల ఎగువ ఉన్న రాష్ట్రాల్లో ఏవిధమైన ఆధిపత్యం చలాయించకుండా దిగువ రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ హక్కులను కేంద్రం పూర్తిగా తన అధీనంలోకి తీసుకోవడం సరైంది కాదని సీనియర్‌ పాత్రికేయులు కె.రామచంద్రమూర్తి అభిప్రాయపడ్డారు.

గతేడాది జులైలో గెజిట్‌ విడుదల చేసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకించిందే తప్ప ఎలాంటి ప్రజా చైతన్య కార్యక్రమాలు నిర్వహించలేదంటే ప్రజల హక్కులను కేంద్రానికి బలిపెట్టడమేనని సీనియర్‌ పాత్రికేయులు కె.శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. గెజిట్‌ అమలైతే పెండింగ్‌ ప్రాజెక్టులు పూర్తి కావడం సాధ్యం కాదని విశ్రాంత ఇంజినీర్‌ శ్యాంప్రసాద్‌రెడ్డి తెలిపారు. సమావేశాన్ని విద్యావేత్త గోనారెడ్డి సమన్వయం చేయగా ఫోరం ఛైర్మన్‌ రణదీప్‌రెడ్డి, జాతీయ అధ్యక్షుడు రాజారెడ్డి, విశ్రాంత ఇంజినీర్‌ డి.లక్ష్మీనారాయణ, తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు అంబటి నాగయ్య, విశ్రాంత ఐఏఎస్‌ ప్రభాకర్‌, డీపీ రెడ్డి తదితరులు మాట్లాడారు.

ఇవీ చదవండి: 'కేంద్రం నిధులిస్తుంటే ఫొటోలు, పేర్లు మార్చి తెరాస ప్రజలను ఏమార్చుతోంది'

100 డిగ్రీల ఉష్ణోగ్రతను తట్టుకునేలా వ్యాక్సిన్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.