ETV Bharat / state

రోడ్డు వెడల్పులో శివాలయం తొలగింపుకు యత్నం.. అడ్డుకున్న భాజపా, వీహెచ్​పీ - latest news of nalgonda

నల్గొండ జిల్లాలో రోడ్డు వెడల్పు​లో భాగంగా మిర్యాలగూడ-సాగర్ రోడ్లో ​ఉన్న శివాలయం తొలగింపును భాజపా, విశ్వహిందూ పరిషత్ కార్యకర్తలు అడ్డుకున్నారు. అర్థ దశాబ్దం నుంచి పూజలందుకుంటున్న దేవాలయాన్ని తొలగించడం సరికాదంటూ వారు ఆందోళన నిర్వహించారు.

Activists of Vishwa Hindu Parishad who blocked the removal of the Shiva temple by expanding road works at nalgonda
జడ్చర్ల హైవే రోడ్డు వెడల్పునకు శివాలయం తొలగింపు
author img

By

Published : Jul 5, 2020, 1:53 PM IST

నల్గొండ జిల్లా కోదాడ జడ్చర్ల హైవే రోడ్డు వెడల్పు పనులు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో సాగర్​రోడ్​ లారీ అసోసియేషన్ వద్ద ఉన్న శివాలయం రోడ్డు నిర్మాణానికి అడ్డుగా ఉండడం వల్ల దాన్ని తొలగించడానికి కాంట్రాక్టరు ప్రయత్నించగా భారీ సంఖ్యలో విశ్వహిందూ పరిషత్ కార్యకర్తలు చేరుకొని ఆందోళన నిర్వహించారు.

గత 50 సంవత్సరాలుగా ఈ శివాలయం భక్తులచే ధూప దీప నైవేథ్యాలతో పూజలందుకుంటుందని అలాంటి గుడిని తొలగించడం సబబు కాదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని వారికి సర్ది చెప్పి అక్కడి నుంచి పంపేశారు.

ఇవీ చూడండి: కరోనా చికిత్సపై భయం... నమ్మకం పెంచే పనిలో ప్రభుత్వం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.