ETV Bharat / state

పోలీసులకు కొబ్బరి బోండాలు అందజేత

కొవిడ్ సంక్షోభంలో విధి నిర్వాహణలో అహర్నిశలు కృషి చేస్తోన్న పోలీస్​ సిబ్బందికి పలువురు అండగా నిలుస్తున్నారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో లాక్​డౌన్​ విధుల్లో ఉన్న పోలీసులకు.. కొబ్బరి బోండాలు, పండ్ల రసాలు అందజేసి మానవత్వాన్ని చాటుకుంటున్నాడు ఓ యువకుడు.

Humanist helps to poor
Humanist helps to poor
author img

By

Published : May 20, 2021, 9:34 AM IST

కరోనా విపత్కర పరిస్థితుల్లో పలువురు దాతలు వివిధ రూపాల్లో సహాయం అందిస్తూ.. తమ దాతృత్వం చాటుకుంటున్నారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన షోయబ్ అనే యువకుడు.. లాక్​డౌన్​ విధుల్లో, మహమ్మారిపై ముందుండి పోరాడుతోన్న పోలీసులకు ఐదు రోజులుగా.. కొబ్బరి బోండాలు, పండ్ల రసాలు అందజేస్తున్నాడు. మానవతా దృక్పథంతో నిలువ నీడ లేని యాచకులకు అన్నదానం చేస్తూ అందరి ప్రశంసలను పొందుతున్నాడు.

స్థానిక అతిథి హోటల్ యాజమాన్యం, మరి కొంతమంది దాతల సహకారంతో.. ఆపత్కాలంలో పేదల ఆకలి తీరుస్తున్నట్లు షోయబ్ తెలిపారు.

ఇదీ చదవండి: రూ.2 కోట్ల కొలువు సాధించిన దీప్తికి సీపీ అంజనీకుమార్ ప్రశంసలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.