ETV Bharat / state

ఆరేళ్లకే అనుకోని కష్టం.. ఆడిపాడే వయస్సులో ఆసుపత్రికి పరిమితం - కేసీఆర్​కు చిన్నారి లేఖ

చిట్టితల్లికి పెద్ద కష్టమొచ్చింది. ఆడుతూ పాడుతూ ఆనందంగా గడిపే సమయంలో ఆసుపత్రికి పరిమితమైంది. సంతోషంగా సాగుతున్నఆ కుటుంబ ప్రయాణాన్ని అనుకొని ఆపద చిన్నాభిన్నాం చేసింది. రెక్కాడితే గానీ డొక్కాడని వీరిపై వైద్యఖర్చులు మోయలేని భారాన్ని మోపాయి. కన్నబిడ్డను కాపాడుకునేందుకు స్థోమతకు మించి అప్పులు చేసి మరి చికిత్స కోసం ఖర్చుచేస్తున్నా.... అవి చాలడం లేదు. ఇక మనసున్న మారాజులు సాయం చేస్తున్నా.. చిన్నారి కష్టాన్ని పూర్తిస్థాయిలో తీర్చలేకపోతోంది. ఈ దిక్కుతోచని స్థితిలో ఏం చేయాలో తెలియక... తనను ఈ ఆపద నుంచి గట్టెక్కించాలని స్వయంగా చిన్నారే ముఖ్యమంత్రిని వేడుకుంటోంది. కేసీఆర్ తాతయ్యా..! నన్ను బతికించావా.. ప్లీజ్‌ అంటూ వేడుకుంటోంది.

baby girl latter to cm kcr
Chaitra
author img

By

Published : Apr 11, 2021, 4:19 AM IST

Updated : Apr 11, 2021, 11:26 PM IST

ఆరేళ్లకే అనుకోని కష్టం.. ఆడిపాడే వయస్సులో ఆసుపత్రికి పరిమితం

ముఖ్యమంత్రి కేసీఆర్ తాతకు నమస్తే. మీ ఆరోగ్యం ఎలా ఉంది?. మీరు బాగుంటేనే నాలాంటి ఎంతో మంది పిల్లలు బాగుంటారు. నా పేరు చైత్ర. వయస్సు ఆరేళ్లు. నేను హైదరాబాద్‌లోని రెయిన్ బో ఆసుపత్రి నుంచి మాట్లాడుతున్నాను. ఎక్కడో ఊళ్లో ఉండాల్సిన నేను ఆసుపత్రిలో ఎందుకున్నానని అనుకుంటున్నావా? చెబుతాను తాత.... చెబుతాను.

మాఊరు నల్గొండ జిల్లా అనుముల మండలం ముక్కమాల గ్రామం. ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్న నాగార్జున సాగర్ నియోజకవర్గంలోనే ఉంటుంది మాఊరు. అమ్మ పేరు నాగమ్మ.... నాన్నపేరు సతీశ్‌. ఇద్దరు వ్యవసాయ కూలీలుగా పనిచేస్తూ నన్ను మా చెల్లిని పెంచుతున్నారు. ఓ రోజు అమ్మానాన్న పనికెళ్తూ మమ్మల్ని అమ్మమ్మ దగ్గర ఉంచి వెళ్లారు. అమ్మమ్మ దేవుడికి దీపం పెట్టి బయటకెళ్లింది. నేను, చెల్లి దేవుడికి దండం పెడుతుండగా దీపం నా బట్టలకు అంటుకుంది. బాగా ఏడ్చాను. అప్పటికే సగం వరకు కాలిపోయాను. అమ్మానాన్న, అమ్మమ్మ ఏడ్చుకుంటూ హాలియాలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి డాక్టర్ అంకుల్.... పాపకు సీరియస్ గా ఉంది నల్గొండకు తీసుకువెళ్లమన్నారు. నల్గొండలోని సాయిరక్ష ఆస్పత్రికి తీసుకెళ్లాక అక్కడి డాక్టర్ అంకుల్ నన్ను చూసి హైదరాబాద్ తీసుకువెళ్లమని చెప్పారు. అమ్మానాన్నలకు బాగా భయమేసింది. నేను బతకనేమోనని. అక్కడి నుంచి ఎల్బీనగర్ లోని అరుణ ఆసుపత్రిలో చూపించారు. అప్పటికే కాలిపోయిన నా శరీరం బాగా పాడైందట. నేను బతకాలంటే పెద్దాసుపత్రికి తీసుకువెళ్లమని రాశారు. అలా నాలుగైదు ఆస్పత్రులు తిరిగాక ఇక్కడికొస్తే కానీ నన్ను పట్టలేదు. అప్పటికే అమ్మానాన్నల దగ్గర ఉన్న డబ్బంతా అయిపోయింది. 40 రోజులుగా ఆసుపత్రిలోనే ఉన్నాను తాతయ్య. నన్ను బతికుంచునేందుకు నాన్న కట్టిన తాళిని, అమ్మమ్మ చేయించిన నగలనూ అమ్మేశారంట. అలా ఇప్పటివరకు బాగానే పైసలైనయని అమ్మ చెబుతుంటే విన్నా. ఇంకా బాగానే ఖర్చవుతుందట. - చైత్ర.

కేసీఆర్ తాత... నేను బతకాలంటే మా అమ్మానాన్నల దగ్గర డబ్బుల్లేవు. సర్కారు దవాఖానాకు పోదామంటే ఆస్పత్రి నుంచి కదిలితే ఇబ్బంది అవుతుదంటున్నారు డాక్టర్ అంకుల్. ఏం చేయాలో తెలియక అమ్మానాన్న ఆగమైపోతున్నారు. మాలాంటి పిల్లల కోసం మీ ఖాతాలో బోలెడంత డబ్బు ఉంటుందట కదా. అందులో నుంచి కొంచెం నాకు ఇస్తారా తాతయ్య.

నేను బతకాలని చాలా మంది మా అమ్మానాన్నలకు సాయం చేశారు. ఇదిగో ఈ తాత కూడా నాకోసం కష్టపడుతున్నారు. నేను కాలిపోయానని మా తాత.. ఈతాతకు చెప్పారట. వెంటనే నా దగ్గరకొచ్చి కేసీఆర్ తాతకు చెప్పి నిన్ను బతికిస్తా అంటున్నారు. నిజమేనా తాత.... నా కోసం నువ్వొస్తావా. వద్దు తాతా... అక్కడే ఉండు. బయట కరోనా బూచోడున్నడు. మీ ఖాతాలో నుంచి డబ్బులు పంపిస్తావా తాతయ్య. నేను బయటికొచ్చాక బాగా చదువుకొని నీ డబ్బులను మళ్లీ నీకు ఇస్తా తాతా. ఫ్లీజ్ తాతా... మా అమ్మానాన్నలు బాగా కష్టపడుతున్నారు. నన్ను బతికించడానికి. నన్ను బతికించు తాతయ్య. - చైత్ర.

ఇవీ చూడండి: ఫూలే ఆలోచనా విధానాన్నే ప్రభుత్వం అమలుచేస్తోంది: కేసీఆర్​

Last Updated : Apr 11, 2021, 11:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.