ETV Bharat / state

Family wear helmets at home: ఆ ఇంటి పెరట్లోకి వెళ్లాలంటే హెల్మెట్ తప్పనిసరి.. ఎందుకో తెలుసా?

ఇంటికి అందం పెరడు. సాయంత్ర సమయంలో కొంతసేపు అలా పెరట్లో కుర్చుంటే ఆ రిలాక్సే వేరసలు. కానీ.. ఉమారాణి వాళ్ల పెరట్లోకి వెళ్లాలంటే మాత్రం హెల్మెట్ తప్పనిసరి(Family wear helmets at home). అది ఇంట్లో వాళ్లైనా.. బయటి వాళ్లైనా? హెల్మెట్ లేనిదే(Family wear helmets at home) పెరట్లోకి వెళ్లడం కుదరదట! ఇంతకీ ఈ ఉమారాణి ఎవరు? ఆ పెరడేంటి? అనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం మరి.. చదివేయండి 'ఈ పిట్టకథ' మళ్లీ మళ్లీ...

Family wear helmets at home
Family wear helmets at home
author img

By

Published : Oct 21, 2021, 4:31 PM IST

Updated : Oct 21, 2021, 4:58 PM IST

పెరట్లో హెల్మెట్ పెట్టుకుని ఉన్న ఉమారాణి

ఉమారాణి ఉదయమే లేచి పెరట్లో వాకింగ్ చేయాలంటే హెల్మెట్ తప్పనిసరి! వాళ్ల ఆయన పెరట్లో సాయంత్రం సరదాగా తిరగాలంటే హెల్మెట్ తప్పనిసరి! వాళ్లింటికి ఎవరైనా బంధువులొచ్చినా.. చుట్టుపక్కన వాళ్లు వచ్చినా.. పెరట్లోకి వెళ్లాలంటే హెల్మెట్ తప్పనిసరి! అసలీ పెరడేంటి? హెల్మెట్ ఎందుకు తప్పని సరంటే...

నల్లగొండ జిల్లా నకిరెకల్​కు చెందిన ఉమారాణి ఇంట్లో అందరూ వింతగా కనిపిస్తున్నారు. హెల్మెట్ లేనిదే ఎవరూ వాళ్లింటి పెరట్లోకి వెళ్లడం లేదు. ఆమె హెల్మెట్ పెట్టుకునే బట్టలు ఉతుకుతోంది. వాళ్ల పిల్లలకు హెల్మెట్ పెట్టుకునే స్నానం చేపిస్తోంది. వాళ్లాయన పెరట్లో ఏ పని చేసినా.. హెల్మెట్ ఉంటుంది. నకిరెకల్ వాసులకు అదేం అంతు పట్టడం లేదు. అసలెందుకు అందరూ ఇలా హెల్మెట్ పెట్టుకునే ఉంటున్నారనే చర్చ ఆ పరిసరాల్లో జోరుగా నడిచింది.

వాహనం నడిపేటప్పుడు ప్రతిఒక్కరికీ హెల్మెట్ తప్పనిసరి.. అనే సందేశాన్ని ఇవ్వడానికే ఇలా చేస్తున్నారని కొందరు భావించారు. మరికొందరేమో వీళ్లను చూసి పడి పడి నవ్వుకున్నారు. ఉమాదేవిపై ఇరుగు పొరుగు వాళ్లు ప్రశ్నల వర్షం కురిపించారు. వాళ్ల పిల్లలను తోటి స్నేహితులు ఒకటే ఆట పట్టించారు. అయినా... ఉమారాణి కుటుంబం మాత్రం హెల్మెట్ పెట్టుకునే పెరట్లో కనిపిస్తోంది.

ఆ ఇంటి పెరట్లోకి వెళ్లాలంటే హెల్మెట్​ పెట్టుకోవాల్సిందే

పెరట్లో ఓ పిట్ట గూడు పెట్టింది. అందులోనే గుడ్లు పెట్టింది. పొదిగి పిల్లల్ని చేసింది. బయటికి వెళదామంటే.. ఆ రెండు పిట్టలు కలిసి మాపై దాడి చేస్తున్నాయి. వాటికి హాని చేస్తామేమో అని అవి భయపడుతున్నాయి. మేం ఆ పిట్టలను సంరక్షిస్తున్నాం. వాటికి మేత వేస్తున్నాం. నీటి సదుపాయాన్ని కల్పిస్తున్నాం. అందరూ మేం హెల్మెట్ పెట్టుకుని పెరట్లోకి వెళుతుంటే... నవ్వుకుంటున్నారు. అయితేనేం... కొద్దిరోజులైతే ఆ పిట్టలన్నీ ఎగిరిపోతాయి. సంతోషంగా.. అంతకంటే ఆనందం, సంతోషం మాకు మాత్రం ఇంకేముంటుంది.

- ఉమారాణి, ఇంటి యజమాని

ఉమారాణి పెరట్లో ఓ అరటి చెట్టు ఉంది. కొద్దిరోజులకే మంచి గెల కాసింది. ఆ గెలలో ఓ పిట్ట గూడు కట్టుకుంది. అరటి గెల రోజురోజకూ పెరుగుతోంది. పిట్టగూడు కింద పడిపోయేలా కనిపిస్తోంది. ఉమారాణి ఆ గూడును మంచిగా పెట్టాలని భర్తను కోరింది. గూడును సరిచేస్తుండగా పిట్ట దాడికి దిగింది. గూడును చెదరగొడతారని భావించి అక్కడి నుంచి వెళ్లేవరకూ వెంటాడింది. అప్పటినుంచి ఎవరు పెరట్లోకి వెళ్లినా... ఆ పిట్ట పొడుస్తోంది.

అరటి చెట్టుపై పిట్ట గూడు...
అరటి చెట్టుపై పిట్ట గూడు...

ఒక రోజు, రెండు రోజులు, మూడు రోజులు.. ఇలా ఎన్నిరోజులైనా ఆ పిట్ట పొడవడం ఆపలేదు. ఏం చేయాలో తెలియని వాళ్లు ఇక హెల్మెట్ పెట్టుకునే పెరట్లోకి వెళుతున్నారు. చాలామంది ఆ గూడు తీసెయ్యాలని సలహా ఇచ్చారు. ఉమారాణి మాత్రం అందుకు ససేమిరా అంది. ఆ గూడును జాగ్రత్తగా కాపాడుతోంది. ఆ పిట్ట.. దాని పిల్లల అనురాగాన్ని చూస్తూ మురిసిపోతోంది ఆ కుటుంబం.

ఇదీ చదవండి: హైదరాబాదోళ్లు ఊరెళ్లి వస్తే ఎన్నికోట్లు ఖర్చయ్యాయో తెలుసా?

Last Updated : Oct 21, 2021, 4:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.